By: Arun Kumar Veera | Updated at : 25 Mar 2024 09:31 AM (IST)
జరిమానా తప్పించుకోవడానికి ఇంకొన్ని రోజులే గడువు!
Minimum Deposit For PPF, SSY Account: మనలో చాలా మందికి చిన్న మొత్తాల పొదుపు ఖాతా (Small Savings Scheme) ఉంటుంది. నెలకోసారి, లేదా నిర్ధిష్ట సమయంలో ఆ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాలు ఉంటే, మీ కోసం కీలక అప్‌డేట్. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఇంకా ఈ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయకపోయినా/ మర్చిపోయినా మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. జరిమానా నుంచి తప్పించుకోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. కచ్చితంగా చెప్పాలంటే, ఈ నెలాఖరు (31 మార్చి 2024) వరకే గడువుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. ఈ నెల ముగియడానికి ఇంకొన్ని రోజుల సమయమే మిగిలివుంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది కాబట్టి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సుకన్య సమృద్ధి యోజన వంటి ఖాతాల్లో కనీస డిపాజిట్ (Minimum Deposit) చేయాలి. ఇది మిస్ అయితే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, పన్ను ఆదాను ప్రయోజనాన్ని (Income tax saving Benift) కూడా కోల్పోతారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం, PPF ఖాతాదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరం తన ఖాతాలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఆ ఖాతాను నిలిపేస్తారు. ఖాతా ఇన్-యాక్టివ్‌గా మారితే, రుణం (Loan) & పాక్షిక ఉపసంహరణ (Partial withdrawal) సౌకర్యాలు రద్దవుతాయి. అలాంటి ఖాతాను పూర్తిగా క్లోజ్ చేయకుండా మీరు మీ పేరు మీద మరో అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఈ ఇబ్బందులు వద్దు అనుకుంటే.. ఇన్-యాక్టివ్‌గా మోడ్‌లో ఉన్న PPF ఖాతాను తిరిగి క్రియాశీలం (Activate) చేసుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. జరిమానాతో పాటు, వార్షిక కనీస డిపాజిట్ రూ. 500 కూడా డిపాజిట్ చేయాలి. అంటే.. పీపీఎఫ్ ఖాతాను తిరిగి పని చేయించడానికి, ఆ అకౌంట్ ఎన్నేళ్లు నిద్రాణ స్థితిలో ఉంటే అన్ని 550 రూపాయలు (రూ.50 + రూ.500) చెల్లించాలి.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీకు ఉంటే, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే, డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి క్రియాశీలం చేయాలంటే ఏడాదికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. దీంతోపాటు ఏడాదికి కనీసం రూ. 250 చొప్పున డిపాజిట్ చేయాలి. SSY అకౌంట్ ఎన్ని సంవత్సరాలు డిఫాల్ట్ అయితే, అన్ని 300 రూపాయలు (రూ.50 + రూ.250) కట్టాలి.
పన్ను ఆదా ప్రయోజనం
మీరు పన్ను చెల్లింపుదారు (Taxpayer) అయితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో జమ చేసిన పెట్టుబడికి ఆదాయ పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, PPF, SSY ఖాతాల్లో పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31 లోపు కనీస మొత్తం చెల్లించాలి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!