Aadhaar Card Validity Check: వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డ్‌ ఒకటి. ఇది లేకుండా స్కూల్‌ అడ్మిషన్‌ నుంచి బ్యాంక్‌ అకౌంట్‌, గవర్నమెంట్‌ స్కీమ్స్‌ వరకు ఏ పనీ జరగదు. అయితే, మొబైల్‌ టాక్‌ టైమ్‌ ప్లాన్స్‌ లాగా ఆధార్‌ కార్డ్‌కు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఆధార్ కార్డ్‌ మీ చేతిలో ఉన్నప్పటికీ.. దాని చెల్లుబాటు గడువు ముగిస్తే పనికిరాకుండా పోతుంది. ఆధార్ కార్డ్ గడువు ముగిస్తే ఏం చేయాలి, ఆధార్ కార్డ్ ఎన్ని రోజులు చెల్లుబాటు అవుతుంది, వ్యాలిడిటీని ఎలా చెక్‌ చేయాలి?.


అథెంటికేషన్‌ ద్వారా మీ ఆధార్ కార్డ్ చెల్లుబాటులో ఉందో, లేదో ఈజీగా చెక్‌ చేయొచ్చు. ఒక వ్యక్తి ఆధార్ కార్డు నకిలీదో, అసలైనదో కూడా దీనిని బట్టి తెలుస్తుంది. ఆన్‌లైన్ అథెంటికేషన్‌ ద్వారా కూడా ఆధార్‌ చెల్లుబాటు గడువును చెక్‌ చేయొచ్చు. ఆధార్ కార్డ్ లేకుండా ఇప్పుడు ఏ పనీ జరగడం లేదు కాబట్టి, దాని సమాచారాన్ని సరిగ్గా మొయిన్‌టైన్‌ చేయడం చాలా ముఖ్యం. 


ఆధార్ కార్డ్ చెల్లుబాటు అయ్యే గడువు
ఆధార్‌ జారీ చేసే సంస్థ ఉడాయ్‌ (UIDAI), ఒక వ్యక్తికి ఆధార్ కార్డ్‌ జారీ చేస్తే అది అతని జీవితాంతం చెల్లుతుంది. మైనర్‌ల విషయంలో మాత్రం ఆధార్ కార్డు చెల్లుబాటు కొంతకాలమే ఉంటుంది. ఐదు సంవత్సరాల వయస్సు లోపు పిల్లల ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది. దానిని చైల్డ్ ఆధార్ కార్డ్ అంటారు. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత ఆ కార్డ్‌లోని వివరాలను అప్‌డేట్ చేసి, కొత్త కార్డ్‌ తీసుకోవడం తప్పనిసరి.


ఆధార్ కార్డ్ యాక్టివేట్ కావాలంటే ఏం చేయాలి?
ఐదేళ్ల వయస్సు తర్వాత పిల్లల ఆధార్ కార్డును అప్‌డేట్ చేయకపోతే అది ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. అప్పుడు.. పిల్లలకు స్కూల్‌ అడ్మిషన్‌ తీసుకోవడం, రేషన్‌ కార్డులో, గవర్నమెంట్‌ స్కీమ్స్‌లో  పేరు యాడ్‌ చేయించడం లాంటి పనులు చేయలేరు. ఇవన్నీ నడవాలంటే ఆధార్ కార్డును మళ్లీ యాక్టివేట్‌ చేయించాలి. ఇదేమీ కష్టమైన పని కాదు. ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి పిల్లల వేలిముద్రల (బయోమెట్రిక్) డేటాను అప్‌డేట్‌ చేయిస్తే చాలు. పిల్లల ఆధార్ కార్డు స్థానంలో మరో ఆధార్ కార్డు జారీ అవుతుంది. పిల్లలకు 15 ఏళ్ల తర్వాత కూడా ఆధార్ కార్డును ఇదే పద్ధతిలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. 


మీ ఆధార్ కార్డు ఇలా వెరిఫై చేసుకోండి
ముందుగా, ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌ను (https://uidai.gov.in/‌) ఓపెన్‌ చేయాలి.
వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలో మెనూ బార్‌లో కనిపించే 'మై ఆధార్‌' మీద క్లిక్‌ చేయండి.
డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ కాగానే 'ఆధార్ సర్వీసెస్‌'లోకి వెళ్లి, 'వెరిఫై యాన్‌ ఆధార్ నంబర్‌' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను, క్యాప్చా కోడ్‌, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్‌ చేయండి. 
ఇప్పుడు వెరిఫై బటన్‌ మీద క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్‌ను అథెంటికేట్‌ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: డీమెర్జర్‌ న్యూస్‌తో దౌడు తీసిన ఐటీసీ షేర్లు, టార్గెట్‌ ప్రైస్‌ ఇది!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial