ITC Share Price: ఇవాళ్టి ట్రేడ్‌లో (బుధవారం, 05 జులై 2023) ITC షేర్లు 3% ర్యాలీ చేశాయి, 52-వారాల కొత్త గరిష్ట స్థాయిని టచ్‌ చేశాయి. 


ITC నుంచి హోటల్ వ్యాపారం డీమెర్జింగ్‌
సిగరెట్స్‌ నుంచి స్టేషనరీ వరకు వివిధ రకాల వ్యాపాలను ఐటీసీ చేస్తోంది. ఇందులో హోటల్‌ బిజినెస్‌ ఒకటి. ITC నుంచి హోటల్ వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేసే పని చాప కింద నీరు సాగుతోందని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఇదే జరిగితే వాల్యూ అన్‌లాక్‌ అవుతుంది, షేర్‌ ధరలు పెరుగుతాయి. అందువల్లే ఐటీసీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది.


కోల్‌కతా బేస్‌గా పని చేసే ఈ కంపెనీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మార్పులకు అనుగుణంగా, హోటల్ బిజినెస్‌ కోసం ఆల్టర్‌నేట్స్‌ను అన్వేషిస్తున్నట్లు నేషనల్‌ మీడియాలో న్యూస్‌ వచ్చింది. ఈ వార్తతో, BSEలో, ITC షేర్లు 3% పైగా ర్యాలీ చేసి రూ. 480.60 వద్ద తాజా గరిష్ట స్థాయిని తాకాయి.


మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు 


గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా కూడా, మంగళవారం, దాదాపుగా ఇదే మాట చెప్పింది. హోటల్‌ వ్యాపారాన్ని బయటకు తీసి, విడిగా లిస్ట్‌ చేసేందుకు ITC సీరియస్‌గా పని చేస్తోందంటూ మార్కెట్‌లోకి ఓ లీడ్‌ వదిలింది. REIT, JV వంటి ఆల్టర్నేట్‌ స్ట్రక్చర్లను శోధిస్తోందని రిపోర్ట్‌ చేసింది. 


ITC స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌     
హోటల్‌ల వ్యాపారం ARRలో (యావరేజ్‌ రూమ్‌ రెంట్‌) బలమైన అభివృద్ధి కనిపిస్తోంది. దేశ, విదేశాలకు ట్రావెల్‌, టూరిజం యాక్టివిటీస్‌ కొవిడ్-పూర్వ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మంచి రోజులను చూస్తోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ITC స్టాక్‌పై రూ. 485 టార్గెట్‌ను నోమురా కంటిన్యూ చేస్తోంది. వచ్చే 12 నెలల్లో ఈ స్టాక్ రూ. 520కి చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది.


2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు ITC స్టాక్‌ 42% పైగా పెరిగింది. నిఫ్టీ ప్యాక్‌లో, టాటా మోటార్స్ తర్వాత రెండో బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా ఈ స్క్రిప్‌ పని చేసింది. గత 12 నెలల కాలంలో 65% జూమ్‌ అయిన ITC స్టాక్‌, గత రెండు సంవత్సరాల్లోనే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు పైగా పెంచింది. గత నెల రోజుల కాలంలో 7% పైగా లాభపడింది.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ కట్టాల్సిన అవసరం లేకపోయినా ITR ఫైల్‌ చేయాలి, ఎందుకు?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial