Best Mutual Funds To Invest In June 2024: నేరుగా ఈక్విటీల్లోకి డబ్బు పంప్‌ చేసి రిస్క్‌ తీసుకునేకంటే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో (MFs) పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మ్యూచువల్‌ ఫండ్స్‌ రిస్క్‌ను తగ్గిస్తాయి. పైగా, వీటిని మేనేజ్‌ చేయడానికి ఒక ఫండ్‌ మేనేజర్ ఉంటాడు. ఈక్విటీల తరహాలో పెట్టుబడిదారు వీటిపై స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉండదు.


మ్యూచువల్‌ ఫండ్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. లార్జ్‌ & మిడ్‌ క్యాప్‌ (Large & Mid Cap Mutual Funds) కేటగిరీ ఒకటి. ఈ విభాగంలో ఒకేసారి డబ్బును డిపాజిట్‌ చేయొచ్చు లేదా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) రూట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలను ఈ కేటగిరీ ఫండ్స్‌ అందిస్తాయి. అంటే.. వీటిలో పెట్టుబడి పెట్టడానికి లాస్ట్‌ డేట్‌ అంటూ ఉండదు. మీరు ఎప్పుడైనా ఈ ఫండ్‌ పథకంలో పెట్టుబడిని ప్రారంభించొచ్చు, ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చు.


రేషియో ప్రకారం పెట్టుబడులు
లార్జ్‌ & మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే డబ్బును ఫండ్‌ మేనేజర్‌ ఒక రేషియో ప్రకారం పెట్టుబడి పెడతాడు. ఫండ్‌ దగ్గరున్న మొత్తం డబ్బులో 35 శాతాన్ని లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో, మరో 35 శాతాన్ని మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లోకి పంపుతాడు. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి తగ్గించడానికి వీల్లేదు. ఇక, ఫండ్‌ దగ్గర మిగిలిన 30 శాతం మొత్తాన్ని తన విచక్షణ ఆధారంగా ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడి పెడతాడు. ఒకవేళ మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాగా పని చేస్తుంటే మిగిలిన 30 శాతం డబ్బును వాటిలోకే తీసుకెళతాడు. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ లాభాల ర్యాలీకి సిద్ధంగా ఉంటే వాటిలోకి పంప్‌ చేస్తాడు. లార్జ్ క్యాప్ స్పేస్ ఆకర్షణీయంగా ఉందని అతను భావిస్తే ఆ కేటగిరీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 30 శాతం డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, వేటికి పంచాలో నిర్ణయించుకునే అవకాశం ఫండ్ మేనేజర్‌కు ఉంటుంది. 


ఈ గందరగోళం అంతా ఎందుకు మంచి ఫండ్స్‌ పేర్లు చెబుతే చాలు అంటారా?. ఈ నెలలో (జూన్‌ 2024) పెట్టుబడి పెట్టదగిన బెస్ట్‌ లార్జ్‌ & మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇవి:


-- యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ (Axis Growth Opportunities Fund)


-- మిరే అసెట్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ (Mirae Asset Large & Midcap Fund)


-- కెనరా రోబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ (Canara Robeco Emerging Equities Fund)


-- సుందరం లార్జ్ అండ్ మిడ్‌ క్యాప్ ఫండ్ (Sundaram Large and Midcap Fund)


-- కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్‌ ఫండ్ (Kotak Equity Opportunities Fund)


-- క్వాంట్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ (Quant Large & Mid Cap Fund)


ఎకనమిక్‌ టైమ్స్‌ ఈ ఫండ్స్‌ను రికమెండ్‌ చేసింది. ఎకనమిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం... ఈ ఫండ్స్‌ గత మూడేళ్లుగా స్థిరంగా లాభాలు అందిస్తున్నాయి. పైగా, మార్కెట్‌ ఇచ్చిన రిటర్న్‌ రేషియో కంటే వీటి రిటర్న్‌ రేషియో ఎక్కువగా ఉంది. ప్రతికూల రాబడి (negative returns) ఇచ్చే అవకాశాలు వీటిలో తక్కువగా ఉన్నాయి. వీటి అసెట్‌ సైజ్‌ కనీసం రూ.50 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ మీద ఫెడ్‌ నిర్ణయాల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి