Benefits With Travel Credit Cards: ఇది క్రిస్మస్‌ సెలవుల (Christmas 2024 Holidays) సీజన్. సెమీ క్రిస్మస్‌ నుంచి న్యూ ఇయర్‌ (New Year 2025) వరకు చాలా మంది హాలిడే మూడ్‌లో ఉంటారు. ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి కొంతమంది సింగిల్‌గా, ఫ్రెండ్స్‌ లేదా కుటుంబాలతో కలిసి టూర్‌ ప్లాన్స్ చేస్తారు. క్రిస్మస్‌/ కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏదో ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్లి, అక్కడ కొన్ని రోజులు గడిపేవాళ్లు కొందరైతే.. రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వెకేషన్‌కు వెళ్లే వాళ్లు ఇంకొందరు. ఇందుకోసం వివిధ రకాల టూర్ ప్యాకేజీలను పరిశీలిస్తుంటారు. ముఖ్యంగా, ప్రయాణ టిక్కెట్ల రేట్లపై లెక్కలు వేస్తుంటారు.


సెలవులు వచ్చిన ప్రతిసారీ, సహజంగా, టికెట్ ధరలు పెరుగుతుంటాయి, టూర్‌ ప్లాన్‌ చేసేవాళ్లను బాధ పెడుతుంటాయి. అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే వెకేషన్‌ కోసం వెళ్లకపోవడమే బెటర్‌ అనిపిస్తుంది. అయితే, ఇప్పుడు, పెరిగిన వెకేషన్‌ వ్యయాలను చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అలాగే, టూర్ ప్లాన్‌ను రద్దు చేసుకునే పని కూడా ఉండదు. ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు మీకు సాయం చేస్తాయి, కొన్ని ఖర్చుల నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు, భారీ క్యాష్‌బ్యాక్‌లు కూడా అందిస్తాయి.


విమానాశ్రయాలు & ఐఆర్‌సీటీసీ బుకింగ్‌ పాయింట్ల వద్ద...
పర్యటన ఖర్చులకు సబ్సిడీ పొందడానికి, విమానాశ్రయం (Airport) లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) బుకింగ్‌ పాయింట్ల వద్ద డిస్కౌంట్‌లను అందించే క్రెడిట్ కార్డ్‌లను వినియోగించాలి. ఇవి మీకు రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. ఆ రివార్డ్‌ పాయింట్లను మీరు వివిధ రకాలుగా ఉపయోగించుకుని ప్రయోజనం పొందచ్చు, డబ్బు ఆదా చేసుకోవచ్చు. 


ఈ ట్రావెల్‌ క్రెడిట్ కార్డ్‌లతో మీకు బెనిఫిట్స్‌ (Benefits you get with these travel credit cards)


ఎస్‌బీఐ ఐఆర్‌సీటీసీ ప్లాటినం క్రెడిట్ కార్డ్ (SBI IRCTC Platinum Credit Card)తో మీరు చేసే ప్రతి లావాదేవీపై 1.8 శాతం ఫీజ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇది కాకుండా, ట్రైన్‌ జర్నీలో AC ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, చైర్ కార్లలో టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే రివార్డ్ పాయింట్ల రూపంలో 10% విలువ రీఫండ్ అవుతుంది. ఈ కార్డ్‌ ద్వారా, కొన్ని నిర్దిష్ట రైల్వే స్టేషన్లలో రైల్వే లాంజ్ కాంప్లిమెంటరీ ఫెసిలిటీని కూడా మీరు పొందుతారు.


ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ (Air India SBI Signature Credit Card) యాన్యువల్‌ ఫీజ్‌ చెల్లించిన తర్వాత, మీకు 15 రోజుల పాటు 20 వేల రివార్డ్ పాయింట్లు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ను ప్రతి త్రైమాసికంలో రెండుసార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డ్‌ను ఉపయోగించి ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ నుంచి విమాన ప్రయాణ టిక్కెట్‌లను కొనుగోలు చేస్తే చాలా రకాల ఆఫర్‌లు పొందుతారు.



కోటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్‌ (Kotak Royale Signature Credit Card)తో ఐఆర్‌సీటీసీలో బుకింగ్‌పై రూ. 500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇంకా అనేక ఇతర సౌకర్యాలతో పాటు, విమానాశ్రయాలు & ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో లాంజ్ సౌకర్యాలను కూడా పొందుతారు.


హెచ్‌డీఎఫ్‌సీ భారత్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌ (HDFC Bharat Cashback Credit Card)లో, మీరు ఐఆర్‌సీటీసీ నుంచి ఎలాంటి బుకింగ్‌ చేసినా 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు.


మరో ఆసక్తికర కథనం: చరిత్ర సృష్టించిన జొమాటో, కేవలం మూడున్నరేళ్లలోనే బంపర్‌ రికార్డ్‌