Top 10 Mutual Funds Those Given Higher Returns In 2024: మారుతున్న కాలంతో పాటు పెట్టుబడులపై మెరుగైన రాబడిని ఆశించేవాళ్లు ఎంచుకునే మార్గాల్లో మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ (Invest in Mutual Funds) ఒకటి. తక్కువ రిస్క్, మంచి రివార్డ్‌తో ఇవి ఇన్వెస్టర్లను సంతోషపరుస్తుంటాయి. ముఖ్యంగా, మ్యూచువల్ ఫండ్స్ (MFs) దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద (Wealth Creation With Mutual Funds) సృష్టిస్తాయి. అయితే, ఇన్వెస్ట్ చేసే ముందు ఏ స్కీమ్‌లో ఎంత రాబడి వస్తుందో తెలుసుకోవాలి. పక్కవాళ్ల సలహాలపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా పరిశోధన చేయాలి. అప్పుడు, మీరు నమ్మదగిన మ్యూచువల్ ఫండ్ పథకాలు మీ కళ్లముందుకు వస్తాయి, మార్కెట్ కష్టకాలంలోనూ మీకు భయం లేకుండా చేస్తాయి.
ETMutualFund డేటా ఆధారంగా, ఈ ఏడాది (2024) ఉత్తమంగా పని చేసిన టాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన లిస్ట్ తయారు చేశాం. ఈ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో (Mutual Fund Schemes) ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు అద్భుతమైన రాబడిని సాధించారు. జనవరి 01, 2024 నుంచి డిసెంబర్ 17, 2024 మధ్య కాలంలో వచ్చిన రిటర్న్స్ లెక్కలు ఇవి.
టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ 2024
మిరే అసెట్‌కు చెందిన రెండు పథకాలు టాప్-10 లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. Mirae Asset NYSE FANG+ETF FoF ఈ సంవత్సరం 82.43 శాతం రాబడితో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. Mirae Asset S&P 500 టాప్ 50 ETF FoF 63.73 శాతం రాబడితో సెకండ్ ర్యాంక్ సాధించింది.
మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది, ఈ ఏడాది కాలంలో 60.52 శాతం వరకు రిటర్న్ ఇచ్చింది.
LIC మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ LIC MF ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కూడా పెట్టుబడిదారులు భారీ లాభాలు ఆర్జించారు. ఈ స్కీమ్ 2024 సంవత్సరంలో 52.52 శాతం వరకు తిరిగి ఇచ్చింది, జాబితాలో 4వ స్థానంలో నిలిచింది.
టాప్-10 లిస్ట్‌లోని జాబితాలోని తదుపరి ఐదు పథకాలు మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్‌కు చెందినవే. మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ 2024లో 50.49 శాతం; మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 FOF 50.37 శాతం రాబడిని అందించాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సమీక్ష కాలంలో 50.23 శాతం లాభాలను; మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 49.29 శాతం లాభాలను తీసుకొచ్చి ఇచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 2024లో 48.84 శాతం రాబడి అందించింది.
దేశంలో, రక్షణ రంగంపై ఆధారపడిన ఏకైక మ్యూచువల్ ఫండ్ అయిన HDFC డిఫెన్స్ ఫండ్, తన పెట్టుబడిదారులకు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది. 2024 సంవత్సరంలో, ఇందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు 48.75 శాతం రాబడి పొందారు.
జనవరి 01, 2024 నుంచి డిసెంబర్ 17, 2024 మధ్య కాలంలో దాదాపు 455 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 0.22 శాతం నుంచి 47.59 శాతం మధ్య లాభాలు ఆర్జించాయి.
గమనిక: ఈ డేటా ETMutualFund డేటా ఆధారంగా తీసుకోవడం జరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ