Bonus Shares And Stock Split: ఫిబ్రవరిలో, ఐదు కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయబోతున్నాయి & స్టాక్ స్ల్పిట్‌ చేయనున్నాయి. ఈ కార్పొరేట్ యాక్షన్‌ ద్వారా తమ పెట్టుబడిదార్లకు అదనపు షేర్లను ఇస్తాయి. ఇప్పటికే ఈ 5 కంపెనీలు మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ రాడార్‌లో ఉన్నాయి.  బోనస్ షేర్లు & స్టాక్ స్ల్పిట్‌ వల్ల షేర్‌ విలువలు పెరిగితే, ఇన్వెస్టర్ల హోల్డింగ్‌ వాల్యూ కూడా పెరుగుతుంది.


ఫిబ్రవరిలో బోనస్ షేర్లు జారీ & స్టాక్ స్ల్పిట్‌ చేయనున్న కంపెనీలు 5 కంపెనీలు:


1. ఎన్సర్ కమ్యూనికేషన్స్ ‍‌(Enser Communications)


ఎన్సర్ కమ్యూనికేషన్స్ అనేది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) సేవలలో ప్రత్యేకత కలిగిన సంస్థ. ఇది కాల్ సెంటర్ కార్యకలాపాలు, ఔట్‌ సోర్సింగ్, డేటాబేస్ నిర్వహణ & IT సేవలను అందిస్తుంది.


స్టాక్ స్ల్పిట్‌: 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్‌ చేస్తారు. అంటే, రూ. 10 ముఖ విలువ కలిగిన ఈ కంపెనీ షేర్‌ను రూ. 2 ముఖ విలువ చొప్పున ఐదు షేర్లు విభజిస్తారు. ఫలితంగా. ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య ఐదు రెట్లు పెరుగుతుంది.


రికార్డ్ తేదీ: స్టాక్ స్ల్పిట్‌ కోసం రికార్డ్‌ డేట్‌ 07 ఫిబ్రవరి 2025.


ఆర్థిక పనితీరు: H1 FY25లో కంపెనీ ఆదాయం 115.7% పెరిగి ₹390.2 మిలియన్లకు చేరుకుంది & నికర లాభం 126.6% పెరిగి ₹48.5 మిలియన్లకు చేరుకుంది.


షేర్ పనితీరు: గత సంవత్సర కాలంలో 315% పెరిగి మల్టీబ్యాగర్ రాబడి అందించింది.


2. రామ ఫాస్ఫేట్స్‌ (Rama Phosphates)


ఇది భారతదేశపు అగ్రగామిగా ఉన్న ఏకైక సూపర్ ఫాస్ఫేట్ ఎరువుల తయారీ సంస్థ.


స్టాక్ స్ల్పిట్‌: 1:2 నిష్పత్తి (ఒక్కో షేరు రెండు షేర్లు అవుతాయి)


రికార్డ్ తేదీ: 07 ఫిబ్రవరి 2025


ఆర్థిక పనితీరు: Q2 FY25లో కంపెనీ ఆదాయం 22.2% పెరిగి ₹2,094.6 మిలియన్లకు & నికర లాభం 359.7% పెరిగి ₹30.8 మిలియన్లకు చేరుకుంది.


షేర్ పనితీరు: గత ఏడాది కాలంలో 14% క్షీణత.


3. ప్రీతిక ఇంజనీరింగ్ కాంపోనెంట్స్‌ (Pritika Engineering Components)


ఈ కంపెనీ ట్రాక్టర్ & ఆటోమోటివ్ రంగాల కోసం యంత్ర భాగాలను తయారు చేస్తుంది.


స్టాక్ స్ల్పిట్‌: 1:2 నిష్పత్తి (₹10 ముఖ విలువ గత ఒక్కో షేర్ ₹5 చొప్పున రెండు షేర్లుగా మారుతుంది)


రికార్డ్ తేదీ: 14 ఫిబ్రవరి 2025


ఆర్థిక పనితీరు: Q2 FY25లో కంపెనీ ఆదాయం 40.6% వృద్ధి చెంది ₹319.9 మిలియన్లకు చేరుకుంది & నికర లాభం 78.2% పెరిగి ₹16.4 మిలియన్లకు చేరుకుంది.


షేర్ పనితీరు: గత సంవత్సర కాలంలో 87.8% ర్యాలీతో అద్భుతమైన రాబడి ఇచ్చింది.


4. థింక్‌ఇంక్‌ పిక్చర్జ్‌ (Thinkink Picturez)


థింక్‌ఇంక్ పిక్చర్స్ అనేది ఒక వినోద సంస్థ. వెబ్ సిరీస్‌లు, చలనచిత్రాలు & టీవీ షోల కోసం కంటెంట్‌ సృష్టిస్తుంది.


బోనస్ షేర్లు: 2:1 నిష్పత్తి (ప్రతి ఒక షేరుకు మరో రెండు కొత్త ఈక్విటీ షేర్లు యాడ్‌ అవుతాయి)


రికార్డ్ తేదీ: 05 ఫిబ్రవరి 2025


ఆర్థిక పనితీరు: Q2 FY25లో కంపెనీ ఆదాయం 81.9% తగ్గి ₹65 మిలియన్లకు చేరుకుంది & నికర లాభం 86.7% తగ్గి ₹4.6 మిలియన్లకు చేరుకుంది.


షేర్ పనితీరు: గత సంవత్సర కాలంలో 88.6% క్షీణించింది.



5. టీటీ లిమిటెడ్‌ (TT Ltd)


ఇది ఒక టెక్స్‌టైల్‌ కంపెనీ. వస్త్రాలు, నూలు తయారు చేస్తుంది.


స్టాక్ స్ల్పిట్‌: 1:10 నిష్పత్తి (₹10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరు ₹1 చొప్పున పది భాగాలుగా స్ల్పిట్‌ అవుతుంది)


రికార్డ్ తేదీ: 12 ఫిబ్రవరి 2025


ఆర్థిక పనితీరు: Q2 FY25లో కంపెనీ నికర అమ్మకాలు 12.8% పెరిగి ₹543.1 మిలియన్లకు చేరుకున్నాయి & నికర లాభం 432.79% పెరిగి ₹4.9 మిలియన్లకు చేరుకుంది.


షేర్ పనితీరు: గత సంవత్సర కాలంలో 23% రాబడి ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్‌ ముందు వీటి తేడాలు తెలుసుకోండి