Stock Market Today: ఎన్నికల ఫలితాల వెల్లడి, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇండియా కూటమికి ఆశించిన దాని కంటే మెరుగ్గా  ఫలితాలు వస్తుండటంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కట్లు బారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 3,500 పాయింట్ల మేర నష్టపోయి 73,053 వద్ద కొనసాగుతోండగా, నిఫ్టీ సైతం 1100 పాయింట్ల మేర నష్టపోయి 22,145 వద్ద ట్రేడ్ అవుతోంది.


ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం వరకు భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు గంటల వ్యవధిలోనే అసలు ఫలితాల వెల్లడితో భారీగా డీలా పడ్డాయి.  ఇన్వెస్టర్ల మార్కెట్ విలువ దాదాపు 21 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.  ముఖ్యంగా ఈ ఫలితాల సరళి ప్రభావం అదాని షేర్లపై ఉంది. ప్రతి అదాని షేర్ పై ముదుపర్లకు దాదాపు 12 నుంచి 20 శాతం మేర నష్టం ఈ ఒక్క రోజులో వచ్చింది.