By: ABP Desam | Updated at : 25 May 2023 08:14 AM (IST)
రిస్క్ చేయకుండానే రెగ్యులర్ ఇన్‌కం సంపాదించొచ్చు
Regular Income Schemes: ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి. షేర్ల నుంచి బంగారం వరకు, మ్యూచువల్ ఫండ్ల నుంచి రియల్ ఎస్టేట్ వరకు చాలా రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదార్లలో కొందరిది షార్ట్‌కట్ రూట్. ఎక్కువ రిస్క్ తీసుకుని, షార్ట్ టర్మ్‌లో డబ్బు సంపాదించాలనుకుంటారు. మరికొందరిది స్ట్రెయిట్ రూట్. తక్కువ రిస్క్‌తో, దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా డబ్బు సంపాదనను ఇష్టపడతారు. రెండో కోవకు చెందిన వ్యక్తుల కోసం కొన్ని పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిలో డబ్బులు మదుపు చేస్తే, క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.
స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, రిటైర్‌మెంట్ పథకాలు లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా ప్రాచుర్యం పొందాయి. ఇవి కాకుండా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీ ఫండ్స్‌లో కూడా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) మీకు రెగ్యులర్ ఆదాయాన్ని అందించే ఒక పెట్టుబడి పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకం (స్మాల్ సేవింగ్స్ స్కీమ్) కింద నడుస్తుంది. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే రూ. 15 లక్షల వరకు జమ చేయవచ్చు. కనిష్టంగా రూ. 1000 పెట్టుబడి నుంచి ప్రారంభించవచ్చు.
ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు లేదా గోల్డ్ బాండ్లు
నిధులను సేకరించేందుకు ప్రభుత్వం ఇటువంటి బాండ్లను జారీ చేస్తుంది. దీని కింద కొంత కాలం పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడిపై వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. హామీతో కూడిన రాబడిని ఇది ఇస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది మంచి ఎంపిక. ఫిక్స్‌డ్ రేట్ బాండ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB), ఇన్‌ఫ్లేషన్-ఇండెక్స్డ్ బాండ్‌లు, PSU బాండ్‌లు, జీరో-కూపన్ బాండ్‌లు మొదలైన వాటిలో మీ డబ్బును జమ చేయవచ్చు.
మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్
నెలవారీ ఆదాయ ప్రణాళిక (MIP) అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి. డెట్ & ఈక్విటీ సెక్యూరిటీల నుంచి ఆదాయాన్ని పొందడం, మూలధనాన్ని సంరక్షించడం వంటి లక్ష్యాలతో ఈ పెట్టుబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని సంపాదించడానికి సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్‌ను (Systematic withdrawal plan -SWP) ఉపయోగించడం ఉత్తమ మార్గం.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి
మీ పెట్టుబడిపై మంచి ఆదాయం సంపాదించడానికి రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, ఆకర్షణీయమైన మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కాకుండా... కేంద్ర ప్రభుత్వం అందించే PPF, రిటైర్మెంట్ ఫండ్ EPF, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
Gold Rate: బంగారం, వెండి ధరల ట్రెండ్ కొనసాగుతుందా! 2026లో ఎంత పెరుగుతుంది? నిపుణులు ఏమన్నారు?
Aadhaar and PAN cards Linked: మీ ఆధార్ పాన్ కార్డు లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి! లేకపోతే జనవరి 1 నుంచి ఇబ్బందులు తప్పవు!
New Year Offer: కొత్త సంవత్సరానికి బంపర్ ఆఫర్! ఈ కంపెనీ ఉచితంగా అదనపు డేటాను అందిస్తోంది! పరిమిత ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Silver Price: వెండి మెరుపు ముందు వెలవెలబోయిన బంగారం, స్టాక్ మార్కెట్! ఏడాదిలో 130% కంటే ఎక్కువ పెరుగుదల!
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?