బ్యాంకులు ఒక్కరోజు పనిచేయకపోతే కోట్లలో లావాదేవీలు నిలుస్తాయి. బ్యాంకు సెలవు ఉందంటే ఒకరోజు ముందే బ్యాంకు వద్ద క్యూ కడతారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఆర్బీఐ నూతన విధానాలను తీసుకొచ్చింది.


చెక్ జారీ, సుర‌క్షిత‌మైన చెల్లింపులు, లావాదేవీల‌ భ‌ద్రతను పెంచేందుకు ప‌టిష్ఠమైన విధానాలను అమ‌లుచేస్తూ వ‌స్తోంది ఆర్‌బీఐ. అధిక విలువ గ‌ల చెక్కుల‌ సేఫ్టీ కోసం ఈ ఏడాది జ‌న‌వ‌రిలో పాజిటివ్‌ పే వ్యవస్థను తీసుకొచ్చింది. రూ.50వేలు, అంత‌కంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మ‌రింత సుర‌క్షితంగా నిర్వహించేందుకు చెక్ వివ‌రాల‌ను రీ-కన్ఫర్మేషన్ చేయాల‌ని సూచించింది.  చెక్కు జారీ చేసిన వారు చెక్ నంబ‌రు, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబ‌రు, అమౌంట్.. లాంటి అన్ని వివరాలు బ్యాంకు అధికారులకు ఎలక్ట్రానికి పద్ధతిలో తెలియజేయాల్సి ఉంటుంది. అలా నిర్ధారణ చేస్తేనే.. చెక్కు ఎవరిపేరు మీద ఇష్యూ అయిందో వారికి ఖాతాలోకి డబ్బు జమ అవుతుందన్న మాట. దీని ద్వారా మోసాలను అరికట్టవచ్చు.  గతంలో వెళ్లినట్టు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి చెక్కు క్రాస్ చెక్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు.


నేష‌న‌ల్ ఆటోమెటెడ్ క్లియ‌రింగ్ హౌస్‌-NACH-నాచ్‌ ఈ నెల నుంచి 24 గంట‌లూ ప‌నిచేస్తుంది. ఈ నిర్ణయంతో సెల‌వు దినాల్లో కూడా చెక్ క్లియ‌రింగ్‌కు వెళ్లి క్యాష్ చేసుకునే వీలుంటుంది. ఈ మేరకు బ్యాంకింగ్ నియ‌మాల్లో ఆర్‌బీఐ కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఆగ‌స్టు 1 నుంచి అమ‌ల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా బ‌ల్క్ క్లియ‌రింగ్‌ను 24 గంట‌లూ అందుబాటులో ఉంచాల‌ని ఆర్‌బీఐ నిర్ణయించింది. సెల‌వు కదా అనే నిర్లక్ష్యంగా ఖాతాలో సరిపడా నగదు లేకుండా చెక్ ఇవ్వొద్దు. ఇచ్చే ముందు.. సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే చెక్ బౌన్స్ అవుద్ది. అలా అయితే.. పెనాల్టీ చెల్లించాల్సి వ‌స్తుంది.


నాచ్ అంటే..


నాచ్‌ అంటే.. బ‌ల్క్ పేమెంట్ సిస్టమ్. అదే.. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చూసుకుంటుంది. డివిడెంట్‌, వ‌డ్డీ, జీతం, పెన్ష‌న్ వంటి క్రెడిట్ బ‌దిలీల‌ను ఒక‌రి నుంచి అనేక మందికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డాన్ని ఈజీ చేస్తుంది. ఒకటో తేదీ బ్యాంకులకు సెలవు ఉన్నా.. జీతాలు ఉద్యోగుల అకౌంట్ లోకి క్రిడెట్ అవుతాయి. విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాట‌ర్ బిల్లులు, రుణాల‌కు సంబంధించి వాయిదాలు, మ్యూచువ‌ల్ ఫండ్స్ పెట్టుబ‌డులు, బీమా ప్రీమియం లాంటివి.. సుల‌భంగా చేయోచ్చు.


 


Also Read: Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకున్నారు సరే.. మరి ఈ విషయాలను ఆలోచించారా?


                    Cyber Insurance Policy: డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా.. ? అయితే మీకు ఈ పాలసీ అవసరం