Credit cards:
ఇయర్ ఎండ్ వచ్చేసింది! నెల రోజుల్లో 2022 ముగియనుంది. సాధారణంగా సంవత్సరాంతం వచ్చేసిందంటే కొందరు విదేశాలకు వెళ్తుంటారు. చాలామంది స్వదేశంలోనే దర్శనీయ ప్రాంతాలు వెతుక్కొని అక్కడే వేడుకలు చేసుకుంటారు. బిజీగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్‌ను ఎంచుకోవడం తెలిసిందే! ఇలాంటి వారికోసమే బ్యాంకులు ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. విమాన టిక్కెట్ల నుంచి హోటల్ బుకింగ్స్ వరకు రివార్డులు ఇస్తున్నాయి.
ఎస్‌బీఐ కార్డ్స్
ఎస్‌బీఐ కార్డ్స్ కంపెనీ ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. ఖర్చు చేసే ప్రతి రూ.100పై 30 రివార్డు పాయింట్లు డిపాజిట్ చేస్తుంది. ఎయిర్ ఇండియా పోర్టల్స్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసినా, ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ ఫ్లైయింగ్ రిటర్న్స్ సబ్‌స్క్రిప్సన్ మీద రివార్డులు ఇస్తోంది. ప్రయారిటీ పాస్ ప్రోగ్రామ్ కింద 600 ఎయిర్ పోర్టు లాంజ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక రివార్డు పాయింటును ఒక ఎయిర్ ఇండియా మైల్ పాయింటుగా మార్చుకోవచ్చు. భారత్‌లోని డొమస్టిక్ వీసా లాంజ్‌లకు ఏడాదిలో ఎనిమిది సార్లు వెళ్లొచ్చు. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.4,999.
యస్ బ్యాంక్ కార్డు
యస్ ఫస్ట్ పేరుతో యస్ బ్యాంక్ ఓ క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఇందులో వచ్చే రివార్డు పాయింట్లను ఎయిర్ మైల్స్‌గా మార్చుకోవచ్చు. 10 రివార్డు పాయింట్లకు ఒక ఇంటర్ మైల్ లేదా క్లబ్ విస్టారా పాయింట్ వస్తుంది. యస్ రివార్డ్జ్ ద్వారా ఫ్లైట్ లేదా హోటల్‌ను బుక్ చేసుకొని రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ కింద రెండుసార్లు డొమస్టిక్ లాంజ్ యాక్సెస్ అందిస్తోంది. ప్రతి రూ.200కు ప్రయాణాల్లో 16, డైనింగ్‌కు 8 రివార్డు పాయింట్లు వస్తాయి. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.999.
హెచ్‌డీఎఫ్‌సీ ప్రివిలేజ్
హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డులను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ చేస్తోంది. ఈ కార్డులో ఒక రివార్డు పాయింటును 0.50 ఎయిర్ మైల్‌గా మార్చుకోవచ్చు. స్మార్ట్ బయ్ ద్వారా విమాన టికెట్లు, హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 12 సార్లు ఎయిర్‌పోర్టు లాంజ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. రిటైల్ స్పెండింగ్‌పై ప్రతి రూ.150కి నాలుగు రివార్డు పాయింట్లు వస్తాయి. ఏడాదికి రూ.2500 కార్డు ఫీజు.
సిటీ కార్డు
సిటీ బ్యాంకు సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఎయిర్‌లైన్ లావాదేవీల్లో ఖర్చు చేసే ప్రతి రూ.100పై 10 మైల్స్ వస్తాయి. ఇతర విభాగాల్లో ఖర్చు చేస్తే 4 మైల్స్ వస్తాయి. కార్డు తీసుకున్న 60 రోజుల్లోపు రూ.1000 ఖర్చు చేస్తే వెల్‌కమ్ బెనిఫిట్‌గా 10,000 మైల్స్ ఇస్తుంది. కార్డును రెనివల్ చేసుకున్న ప్రతిసారీ 3000 మైల్స్ వస్తాయి. ఎప్పటికీ ఎక్స్‌పైర్ కాకపోవడం ఈ రివార్డు పాయింట్ల ప్రత్యేకత. ఎంపిక చేసుకున్న ఎయిర్‌పోర్టు లాంజ్‌ల్లో ఏడాది పాటు యాక్సెస్ ఉంటుంది. ఈ కార్డు ఫీజు రూ.3000.
Also Read: ఈపీఎఫ్, పింఛన్, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!
Also Read: పెట్టుబడిని పెంచే టిప్స్ కావాలా?, దాదాపు 155% ర్యాలీ చేసే 8 స్టాక్స్ ఇవిగో!