Stock Market News: గత 8 రోజులుగా స్టాక్‌ మార్కెట్లు శ్రీహరికోట రాకెట్లలా దూసుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త జీవితకాల గరిష్టాలను సృష్టిస్తున్ాయి. ఈ నేపథ్యంలో.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, గోల్డ్ లోన్, టెక్స్‌టైల్, QSR (క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌) సహా వివిధ రంగాల్లోని 8 స్టాక్స్‌ మీద బ్రోకరేజ్ సంస్థలు కవరేజీ స్టార్ట్‌ చేశాయి. ఈ కౌంటర్ల మీద బ్రోకింగ్‌ హౌస్‌ ఎక్స్‌పర్ట్‌లు పాజిటివ్‌ లుక్‌తో ఉన్నారు. 155% వరకు లాభాలు అందించే సత్తా వాటికి ఉందని మార్కెట్‌ నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. అదే సమయంలో, ఈ కౌంటర్లలో కొన్ని రిస్క్‌లను కూడా హైలైట్ చేశారు. 


బ్రోకరేజ్ కంపెనీలు కొత్తగా కవరేజీని ప్రారంభించిన 8 స్టాక్స్‌ పేర్లు, వాటి టార్గెట్‌ ప్రైస్‌లు, అప్‌సైడ్‌ పొటెన్షియల్‌ వివరాలు ఇవి:


బ్రోకరేజ్‌ సంస్థ: సిస్టమాటిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌
స్టాక్‌ పేరు: గ్రీన్‌ ప్యానెల్‌ ఇండస్ట్రీస్‌ (Greenpanel Industries‍)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 542 
వృద్ధి సామర్థ్యం: 40%


బ్రోకరేజ్‌ సంస్థ: వెంచురా సెక్యూరిటీస్‌
స్టాక్‌ పేరు: ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ (RBL Bank)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 256, దీని తర్వాత రూ. 389
వృద్ధి సామర్థ్యం: 63%, దీని తర్వాత 155%



బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌ పేరు: పీడీఎస్‌ (PDS Limited)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 383, దీని తర్వాత రూ. 389 
వృద్ధి సామర్థ్యం: 9%, దీని తర్వాత 19%



బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
స్టాక్‌ పేరు: మిశ్ర ధాతు నిగమ్‌  (Mishra Dhatu Nigam)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 230  
వృద్ధి సామర్థ్యం: 4%


బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌ పేరు: దేవయాని ఇంటర్నేషనల్‌ (Devyani International)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 383, దీని తర్వాత రూ. 389
వృద్ధి సామర్థ్యం: 9%, దీని తర్వాత 17%


బ్రోకరేజ్‌ సంస్థ: సిస్టమాటిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌
స్టాక్‌ పేరు: మణప్పురం ఫైనాన్స్‌ (Manappuram Finance‌)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 155  
వృద్ధి సామర్థ్యం: 35%


బ్రోకరేజ్‌ సంస్థ: సిస్టమాటిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌
స్టాక్‌ పేరు: ముత్తూట్‌ ఫైనాన్స్‌ (Muthoot Finance)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 1550
వృద్ధి సామర్థ్యం: 39%


బ్రోకరేజ్‌ సంస్థ: సిస్టమాటిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌
స్టాక్‌ పేరు: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ (IIFL Finance)
సిఫార్సు: బయ్‌
టార్గెట్‌ ధర: రూ. 773 
వృద్ధి సామర్థ్యం: 66%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.