ITR Filing Last Date :  ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గతంలో మాదిరిగా ఈ సారి గడువు పెంచే చాన్స్ లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కరోనా ఇతర ఆర్థిక కారణాల వల్ల రెండేళ్లు రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పెంచుకుంటూ పోయారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి గడువు ఇచ్చే ఉద్దేశంలో కేంద్రం లేదు. జూలై 31వ తేదీ కల్లా అందరూ రిటర్నులు ఫైల్ చేయాల్సిందే్. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22  ఐటీ రిట‌ర్న్స్  ప‌న్ను చెల్లింపుదారులు త‌ప్ప‌నిస‌రిగా ఐటీ రిట‌ర్న్స్ స‌బ్‌మిట్ చేయాల్సిందేన‌ని కేంద్ర రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి త‌రుణ్ బ‌జాజ్ శుక్ర‌వారం స్ప‌ష్టం చేశారు. 


ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! 3 నెలలకోసారి ప్రమోషన్లు! లిస్టులో మీ కంపెనీ ఉందా?


‌త ఏడాది జూలై 20 నాటికి 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటీ రిట‌ర్న్స్‌ను 2.3 కోట్ల మందికి పైగా ప‌న్ను చెల్లింపుదారులు దాఖ‌లు చేశార‌ని, రోజురోజుకు ఐటీఆర్ దాఖ‌లు చేసే వారి సంఖ్య పెరుగుతుంద‌ని త‌రుణ్ బ‌జాజ్ చెప్పారు.గ‌తేడాది డిసెంబ‌ర్ 31 నాటికి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 5.89 కోట్ల ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌ల‌య్యాయ‌ని త‌రుణ్ బ‌జాజ్ తెలిపారు. ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌తియేటా మాదిరిగానే ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి గడువు పొడిగిస్తార‌ని భావిస్తున్నారు. అందుకే ప్రారంభ ద‌శ‌లో ఐటీఆర్ ఫైలింగ్స్ చాలా నెమ్మ‌దిగా ఉన్నాయి. 


Also Read: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసిన గౌతమ్‌ అదానీ - ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి ఇండియన్‌


ఈ కారణంగా ప్రభుత్వం ముందస్తుగానే క్లారిటీ ఇస్తోంది. పొడిగింపు ఉండదని చెబుతోంది. ప్రస్తుతం ప్ర‌తి రోజూ 15 ల‌క్ష‌ల నుంచి 18 ల‌క్ష‌ల ఐటీ రిట‌ర్న్స్ స‌బ్మిట్ అవుతున్నాయని  మున్ముందు రోజూ 25 నుంచి 30 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ దాఖ‌ల‌వుతాయ‌ని అంచనా వేస్తున్నారు. సాధార‌ణంగా ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌తియేటా ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి తుది గడువు వ‌ర‌కు వెయిట్ చేస్తుంటారు. `గ‌త ఏడాది 9-10 శాతం మంది చివ‌రి రోజు ఐటీఆర్ స‌బ్మిట్ చేశారు. ఈ కారణంగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు కూడా వచ్చాయి. ఈ రష్‌ను ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి కాస్త ముందుగానే రిటర్న్స్ ఫైల్ చేయాలని కేంద్ర అధికారులు చెబుతున్నారు. 



Also Read: 10 పైసలు పెరిగిన రూపాయి! వీకెండ్లో భారీగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ



గత ఏడాది కొత్త వెబ్‌సైట్ ద్వారా రిటర్నులు స్వీకరించి ప్రాసెస్‌ను సులువు చేసే ప్రయత్నం చేశారు. అయితే అనేకసమస్యలు ఏర్పడ్డాయి. ఐటీ రిటర్నులు ఫైల్ చేయడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఫైల్ చేసినా చేయలేదని చూపించింది. అయితే ఈ సారి అలాంటి సమస్యలేమీ లేవని చెబుతున్నారు. గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.