Nidhi Granites Shares: దేశంలో చాలా మంది ఇన్వెస్టర్ల కన్ను ఎల్లప్పుడూ మైక్రో పెన్నీ స్టాక్స్ పైనే ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో చాలా మంది మంచి ఫండమెంటల్స్ కలిగిన చిన్న కంపెనీల షేర్లను తక్కువ ధరల వద్దే ఒడిసిపట్టాలని చూస్తుంటారు. తక్కువ కాలంలోనే అవి చిచ్చుబుడ్డిలా పేలుడు లాభాలను అందిస్తూ తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తుంటాయి.


ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మైక్రోక్యాప్ స్టాక్ సైతం ఇదే కోవకు చెందినది. నమ్మి డబ్బుపెట్టిన పెట్టుబడిదారులకు కేవలం ఏడాదిలోనే 333 శాతం రాబడులతో డబ్బును నాలుగింతలుగా మార్చేసింది. ఏప్రిల్ 2023లో ఒక్కో షేరు ధర రూ.68.21 వద్ద ఉన్న నిధి గ్రానైట్స్ ప్రస్తుతం రికార్డు ర్యాలీ తర్వాత రూ.295.15 స్థాయికి ఎగబాకింది. 2024 ఏప్రిల్ నెలాఖరులో వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 


2024లో కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 136 శాతం మెగా ర్యాలీని నమోదు చేసి నాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసేసింది. అలాగే సెప్టెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య కాలంలో స్టాక్ 377 శాతం ర్యాలీని నమోదు చేసింది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్లలో ఇన్వెస్టర్ల చేసిన పెట్టుబడిదారుల జీవితాలు బంగారంగా మారిపోయాయి. మూడేళ్ల కిందట స్టాక్ ధర ఏప్రిల్ 2021లో కేవలం రూ.33.95గా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి 769 శాతం పెరిగింది. అలాగే ఐదేళ్ల కిందట ఏప్రిల్ 2019లో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ఇన్వెస్టర్లు 825 శాతం రాబడిని పొందేవారు. 


కంపెనీ ఆర్థిక ఫలితాలు సైతం సానుకూలంగా ఉన్నాయి. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 275 శాతం పెరిగి రూ.0.45 కోట్లుగా నిలిచింది. ఈ కాలంలో అమ్మకాలు రూ.10.66 కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్్ మోజో విశ్లేషణ ప్రకారం నిధి గ్రానైట్స్ స్టాక్ మార్కెట్‌లో అనూహ్యంగా రాణిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే స్టాక్ టెక్నికల్స్ పరిశీలిస్తే ప్రస్తుతం అన్ని కీలక మూవింగ్ యావరేజ్ లెవెల్స్ అధిగమించి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి కంపెనీ తన మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటం కోసం ఆసక్తిగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. దీంతో బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్లపై Hold రేటింగ్ కొనసాగిస్తోంది.