LIC Launches New Term Life Insurance Plans: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 4 కొత్త టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రారంభించింది. అవి – ఎల్‌ఐసీ యువ టర్మ్ ప్లాన్‌ (LIC Yuva Term Plan), ఎల్‌ఐసీ డిజి టర్మ్ ప్లాన్‌ (LIC Digi Term Plan), ఎల్‌ఐసీ యువ క్రెడిట్ లైఫ్ ప్లాన్‌ (LIC Yuva Credit Life Plan), ఎల్‌ఐసీ డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్‌ (LIC Digi Credit Life Plan). ఇవి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను అందించడంతో పాటు ఆయా వ్యక్తులు చేసిన రుణాలను కూడా కవర్‌ చేస్తాయి. ఈ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.


ప్రస్తుతం, ప్రజలు వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. హోమ్‌ లోన్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ వంటివి. అప్పు తీసుకున్న వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగితే, ఆ రుణ బాధ్యత కుటుంబ సభ్యులపై పడుతుంది, వారికి పెను భారంగా మారుతుంది. ఎల్‌ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్‌ ప్లాన్స్‌ ఆ రుణ బాధ్యతల భారం నుంచి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తాయి.


ఎల్‌ఐసీ యువ టర్మ్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ డిజి టర్మ్‌ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎల్‌ఐసీ యువ క్రెడిట్ లైఫ్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ డిజి క్రెడిట్ లైఫ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి.


LIC యువ టర్మ్ / LIC డిజి టర్మ్ ప్లాన్‌
ఇది నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్. పాలసీ వ్యవధిలో పాలసీహోల్డర్‌ మరణిస్తే, బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. డెత్‌ బెనిఫిట్స్‌కు గ్యారెంటీ ఉంటుంది. 


బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తం ఎంత?
రూ. 50,00,000 నుంచి రూ. 75,00,000 = రూ. 1,00,000
రూ. 75,00,000 నుంచి రూ. 1,50,00,000 = రూ. 25,00,000
రూ. 1,50,00,000 నుంచి రూ. 4,00,00,000 = రూ. 50,00,000
రూ. 4,00,00,000 పైన = రూ. 1,00,00,000


ప్రీమియం చెల్లింపు
సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ ఎంచుకున్నప్పుడు.. పాలసీ వ్యవధిలో పాలసీహోల్డర్‌ మరణిస్తే, సింగిల్ ప్రీమియంలో 125% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తాన్ని డెత్‌ బెనిఫిట్‌గా LIC చెల్లిస్తుంది.


ఫీచర్లు
మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు
రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్‌ ఆప్షన్లు 
డెత్‌ బెనిఫిట్‌ - వార్షిక ప్రీమియానికి 7 రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తం.
డెత్‌ బెనిఫిట్‌లో కనీస వయస్సు 18 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు 
మెచ్యూరిటీ బెనిఫిట్‌లో కనీస వయస్సు 33 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు


LIC యువ క్రెడిట్ లైఫ్/ LIC డిజి క్రెడిట్ లైఫ్
ఇది నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇందులో, పాలసీ వ్యవధిలో డెత్ బెనిఫిట్ తగ్గుతూ వస్తుంది.


బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తం ఎంత?
రూ. 50,00,000 నుంచి రూ. 75,00,000 = రూ. 1,00,000
రూ. 75,00,000 నుంచి రూ. 1,50,00,000 = రూ. 25,00,000
రూ. 1,50,00,000 నుంచి రూ. 4,00,00,000 = రూ. 50,00,000
రూ. 4,00,00,000 పైన = రూ. 1,00,00,000.


ఫీచర్లు
మహిళల కోసం ప్రత్యేకంగా తక్కువ ప్రీమియం ధరలు
రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు ఎంపికలు
డెత్‌ బెనిఫిట్‌ - వార్షిక ప్రీమియానికి 7 రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% లేదా ముందుగా హామీ ఇచ్చిన మొత్తం.
డెత్‌ బెనిఫిట్‌లో కనీస వయస్సు 18 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు 
మెచ్యూరిటీ బెనిఫిట్‌లో కనీస వయస్సు 23 సంవత్సరాలు - గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు
ఆకర్షణీయమైన సమ్ అష్యూర్డ్ రిబేట్ బెనిఫిట్‌
మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు
పాలసీ ప్రారంభంలో రుణ వడ్డీ రేటును ఎంచుకునే ఆప్షన్‌


ప్రీమియం చెల్లింపు
పన్నులు, అదనపు ప్రీమియం మినహా చెల్లించాల్సిన మొత్తాన్ని సింగిల్‌ ప్రీమియంగా లెక్కిస్తారు.


మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను గానీ, ఎల్‌ఐసీ ఏజెంట్‌ను గానీ సంప్రదించొచ్చు.


మరో ఆసక్తికర కథనం: చల్లబడ్డ ఇంధనం రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి