LIC of India Warns Customers On Fraudulent LIC Apps: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పేరుతో ఆన్‌లైన్‌లో చాలా నకిలీ యాప్స్‌/ మోసపూరిత యాప్స్‌ ఉన్నాయని, అలాంటి ఫేక్‌ యాప్స్‌తో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ రంగ బీమా సంస్థ LIC తన పాలసీదార్లు, కస్టమర్లను హెచ్చరించింది. ఎల్‌ఐసీ పేరు మీద నకిలీ యాప్స్‌ చలామణీ అవుతున్నట్లు తెలియడంతో, తాజాగా కొన్ని అప్రమత్త సూచనలు జారీ చేసింది. మోసపూరిత యాప్స్‌ను ఓపెన్‌ చేసి మాయగాళ్ల వలలో పడొద్దని ఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ సూచించింది.


సోషల్ మీడియాలో LIC పోస్ట్
'X'లోని అధికారిక సోషల్ మీడియా ఖాతాలో LIC ఒక పోస్ట్ చేసింది. “లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మీడియా అప్లికేషన్లు సర్క్యులేట్ అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. LIC పాలసీదారులు & కస్టమర్లు అధికారిక ఛానెల్స్‌ LIC ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ (www. licindia.com) లేదా LIC డిజిటల్ యాప్ & మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఆమోదించిన/చెల్లుబాటు అయ్యే/ధృవీకరించిన గేట్‌వేల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని మేము కోరుతున్నాం. ఏ ప్రత్యామ్నాయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగే చెల్లింపులకు LIC ఆఫ్ ఇండియా బాధ్యత వహించదని గమనించండి"


LIC అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ ఏవి?
అధికారిక వెబ్‌సైట్ (www.licindia.in), LIC డిజిటల్ యాప్ లేదా LIC వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఇతర ధృవీకరించిన గేట్‌వేల ద్వారా మాత్రమే చెల్లింపులు, ఇతర లావాదేవీలు చేయాలని జీవిత బీమా సంస్థ తన కస్టమర్లకు సూచించింది.


- కస్టమర్‌లు (022) 6827 6827 నంబర్‌లో ఫోన్ ద్వారా LICని సంప్రదించవచ్చు
- ఆన్‌లైన్‌లో www.licidia.in ను సందర్శించండి
- ట్విట్టర్‌ (Twitter), ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) & యూట్యూబ్‌ (YouTube)లో LIC అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ LICIndiaForever అనే పేరుతో కనిపిస్తుంది
- అధికారిక LIC ఏజెంట్ లేదా మీ దగ్గరలోని బ్రాంచ్‌ను సందర్శించండి.
- ఈ ఛానెళ్ల ద్వారా కస్టమర్‌లు తమ పాలసీల గురించి విచారించవచ్చు, వివరణ పొందవచ్చు.


LIC అధికారిక యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?
LIC అధికారిక యాప్‌ ఏదో తెలుసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటే... మీరు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ www.licindia.in లోకి మీ ఫోన్‌లోకి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించే యాప్‌ సంబంధిత లింక్‌పై క్లిక్‌ చేస్తే, అధికారిక యాప్‌ మాత్రమే మీకు కనిపిస్తుంది. దానిని చేసి మీ మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఎల్‌ఐసీ పేరిట డబ్బు చెల్లించి మోసపోతే?
అధికార LIC ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కాకుండా, అనధికార డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే ఏవైనా చెల్లింపులకు తాము బాధ్యత వహించబోమని, కస్టమర్లదే పూర్తి బాధ్యత అని LIC స్పష్టం చేసింది.


నకిలీ పేమెంట్‌ పోర్టల్స్‌
డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి, చట్టబద్ధమైన బ్యాంకింగ్, బీమా లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను అనుకరిస్తూ మోసగాళ్లు నకిలీ ఫ్లాట్‌ఫామ్‌లను సృష్టిస్తారు. అవి చూడ్డానికి అచ్చం అధికారిక పోర్టల్‌ లేదా ఫ్లాట్‌ఫామ్‌ లేదా యాప్‌ లాగా కనిపిస్తాయి. కాబట్టి వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలి. ఈ మోసపూరిత పోర్టల్‌ లేదా ఫ్లాట్‌ఫామ్‌ లేదా యాప్‌ ద్వారా సైబర్ నేరస్థులు ప్రజల బ్యాంకింగ్ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్‌లు లేదా OTPలు వంటి రహస్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఆ వివరాలను ఉపయోగించుకుని ప్రజల డబ్బును దోచుకుంటారు, ఆర్థిక నష్టం కలిగిస్తారు.


మరో ఆసక్తికర కథనం: కన్‌ఫ్యూజ్‌ కావద్దు, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి 4 పెద్ద కారణాలివి