Latest Gold-Silver Prices Today: అమెరికాలో ప్రైవేట్‌ జాబ్స్‌ డేటా తర్వాత, యూఎస్ ఫెడ్‌ నుంచి ఈ ఏడాది ఆశించిన మేర వడ్డీ రేట్ల కోతలు ఉండవన్న అంచనాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ భారీగా పుంజుకుంది, 4-వారాల గరిష్ట స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,675 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 380 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 350 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 280 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ లెక్కన, ప్యూర్‌ గోల్డ్‌ (24K) 100 గ్రాములకు రూ. 3,800 పెరిగింది. ఇవాళ, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,200 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,600 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,400 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,200 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,600 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,400 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 79,200 ₹ 72,600 ₹ 59,400 ₹ 1,00,000
విజయవాడ ₹ 79,200 ₹ 72,600 ₹ 59,400 ₹ 1,00,000
విశాఖపట్నం ₹ 79,200 ₹ 72,600 ₹ 59,400 ₹ 1,00,000

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,260 ₹ 7,920
ముంబయి ₹ 7,260 ₹ 7,920
పుణె ₹ 7,260 ₹ 7,920
దిల్లీ ₹ 7,275 ₹ 7,935
 జైపుర్‌ ₹ 7,275 ₹ 7,935
లఖ్‌నవూ ₹ 7,275 ₹ 7,935
కోల్‌కతా ₹ 7,260 ₹ 7,920
నాగ్‌పుర్‌ ₹ 7,260 ₹ 7,920
బెంగళూరు ₹ 7,260 ₹ 7,920
మైసూరు ₹ 7,260 ₹ 7,920
కేరళ ₹ 7,260 ₹ 7,920
భువనేశ్వర్‌ ₹ 7,260 ₹ 7,920

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,960 ₹ 7,515
షార్జా ‍‌(UAE) ₹ 6,960 ₹ 7,515
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,960 ₹ 7,515
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,098 ₹ 7,555
కువైట్‌ ₹ 6,816 ₹ 7,432
మలేసియా ₹ 6,935 ₹ 7,222
సింగపూర్‌ ₹ 6,822 ₹ 7,569
అమెరికా ₹ 6,703 ₹ 7,132

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 230 పెరిగి రూ. 26,300 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: నిర్మలమ్మ సమ్మతిస్తే మీకు డబుల్‌ గ్రాట్యుటీ ఖాయం! - త్వరలో తీపి కబురు?