By: Swarna Latha | Updated at : 29 Jun 2024 06:05 AM (IST)
Credit score advantages
Credit Score: దేశంలోని క్రెడిట్ బ్యూరోలు ప్రజలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను పరిశీలన ద్వారా వారి క్రెడిట్ స్కోర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది. ఇందుకోసం ప్రజల క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, లోన్ ఈఎంఐ చెల్లింపుల వివరాలను క్రెడిట్ కార్డ్ కంపెనీలు, రుణ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటుంటాయి. క్రెడిట్ హిస్టరీకి సంబంధించి తగిన సమాచారం లేనప్పుడు.. క్రెడిట్ బ్యూరోలు ప్రజల క్రెడిట్ స్కోర్‌ను రూపొందించలేవు. వాస్తవానికి మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం వల్ల ఉండే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హై లోన్ ఎలిజిబిలిటీ:
ఎవరైనా రుణం కోసం బ్యాంక్ లేదా ఇదర ఆర్థిక సంస్థలను సంప్రదించినప్పుడు సదరు కంపెనీలు ముందుగా లోన్ కోసం అభ్యర్థించిన వ్యక్తి క్రెడిట్ రిపోర్టును పరిశీలించి వారి క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తాయి. ఈ క్రమంలో మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండే వ్యక్తులకు రుణాన్ని అందించేందుకు ప్రాముఖ్యతను ఇస్తుంటాయి. ఉదాహరణకు సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండేవారు సులువులుగా రుణాలు పొందేందుకు అర్హత పొందుతారు. ఇదే క్రమంలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండే వ్యక్తుల రుణ అభ్యర్థనలను సదరు సంస్థలు రిజెక్ట్ చేస్తుంటాయి. తమ అంతర్గత రుణ పాలసీలకు అనుగుణంగా లేనందున లోన్ రిజెక్ట్ చేయబడినట్లు వెల్లడిస్తుంటాయి.
తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు:
రిస్క్ ఆధారిత ప్రైసింగ్ స్ట్రాటజీలో భాగంగా చాలా మంది రుణ సంస్థలు వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు లోన్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి క్రెడిట్ స్కోర్ పరిగణలోకి తీసుకుంటాయి. ఈ క్రమంలో అధిక క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులను ఆకర్షించేందుకు రుణ సంస్థలు ప్రాధాన్యత వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. అలాగే ఆర్థిక సంస్థలు తక్కువ క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లకు రుణాలను అందించటం ద్వారా అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి అందించిన తక్కువ వడ్డీ ఆదాయాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. దీని నుంచి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే దరఖాస్తుదారులు ముందుగా ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్‌లను సందర్శించి వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవటం ఉత్తమం.
రుణాలపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు:
వడ్డీ రేటు విషయంలో మాదిరిగానే కొన్ని రుణ సంస్థలు లోన్ దరఖాస్తుదారులకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజులను తగ్గించటం లేదా వాటిని లోన్ డిస్‌ఛార్జ్ సమయంలో మాఫీ చేయటం వంటి ప్రయోజనాలను అందిస్తుంటాయి. ముఖ్యంగా పెట్ట టికెట్ రుణాల విషయంలో కంపెనీలు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంటాయి. అటువంటి రుసుములను తగ్గించడం లేదా మాఫీ చేయడం వలన మొత్తం క్రెడిట్ ఖర్చులో గణనీయమైన తగ్గింపుకు దారితీయవచ్చు.
క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుదల:
వాస్తవానికి మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులకు ఎల్లప్పుడూ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ సంస్థలు గ్యాలం వేస్తూనే ఉంటాయి. వారికి తమ కార్డు ఉత్పత్తులను విక్రయించాలని చూస్తుంటాయి. మంచి కార్డులను పొందటం ద్వారా.. వినియోగదారులు క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్స్, ఎయిర్ మైల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, డిస్కౌంట్స్ వంటి అనేక సౌకర్యాలను పొందవచ్చు. ఇక్కడ సైతం రుణాల మాదిరిగానే, క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు కూడా తమ క్రెడిట్ దరఖాస్తును ఆమోదించే ముందు దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులకు అధిక లిమిట్ అందిస్తుంటాయి.
ప్రీ-అప్రూవ్డ్ లోన్స్:
ఇక చివరిగా మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులకు బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. వాటిలో వారికి తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఇతర ప్రయోజనాలను సైతం అందించేందుకు ముందుకొస్తుంటాయి. ఇది తక్కువ వడ్డీ రేట్లకు వేగంగా రుణాలను పొందటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అందువల్ల మెరుగైన రుణ ఒప్పందాలను చేసుకునేందుకు క్రెడిట్ స్కోర్ అత్యంత కీలకంగా సహాయపడుతుంది.
High Interest: ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!
Gold-Silver Prices Today 18 Nov: మళ్లీ పరుగు మొదలు పెట్టిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైస్కూల్ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం