New Income Tax Slabs Structure: 2025 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) ఆదాయ పన్ను నియమాలలో కీలక మార్పులను ప్రకటించారు. కొత్త మార్పులు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తాయి, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలవు. ప్రస్తుతం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. కేంద్ర ఆర్థిక మంత్రి 2025 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రకారం, ఇప్పుడు రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపు (Standard Deduction)తో కలిపితే పన్ను మినహాయింపు పరిమితి రూ. 12.75 లక్షలకు చేరుకుంటుంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే 2025 ఏప్రిల్‌ 01 నుంచి అమల్లోకి వస్తుంది.


12.50 లక్షలు సంపాదించే వ్యక్తి ఎంత పన్ను చెల్లించాలి?
2025 ఏప్రిల్‌ 01 నుంచి, రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఆదాయ పన్ను ఉండదు. రూ. 12 లక్షల ఆదాయం పరిధి లోపల ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు సెక్షన్ 87A కింద పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు.  ఒకవేళ, పన్ను చెల్లింపుదారు రూ. 12.50 లక్షలు సంపాదిస్తే, ప్రస్తుత టాక్స్‌ శ్లాబ్‌లను బట్టి రూ. 90,000 వరకు ఆదాయ పన్ను చెల్లించాలి. అదే ఆదాయానికి, 2025 ఏప్రిల్‌ 01 నుంచి అమల్లోకి వచ్చే కొత్త టాక్స్‌ శ్లాబ్‌ల ప్రకారం రూ. 67,500 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంటే నేరుగా రూ. 22,500 పన్ను పొదుపు (Tax savings) ఉంటుంది. 


కొత్త పన్ను శ్లాబ్‌ల వెనక ఉన్న ఉద్దేశం ఇదీ..
ఎక్కువ సంపాదించే వ్యక్తులు కూడా కొత్త టాక్స్‌ శ్లాబ్‌ల ప్రకారం పన్ను ప్రయోజనాన్ని పొందుతారని టాక్స్‌ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, రూ. 16 లక్షలు సంపాదించే వ్యక్తి ఇకపై సంవత్సరానికి రూ. 50,000 వరకు పన్ను డబ్బు ఆదా చేస్తాడు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం నుంచి గరిష్ట డబ్బును ఆదా చేసేలా పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు జరిగాయి. ఫలితంగా, టాక్స్‌పేయర్ల చేతుల్లో సాధ్యమైనంత ఎక్కువ డబ్బు మిగులుగుతుంది, వివిధ అవసరాల కోసం వాటిని ఖర్చు పెడతారు. తద్వారా, వినియోగం పెరిగి దేశ ఆర్థిక వృద్ధిని కూడా పెంచుతుంది. 


ఎక్కువ సంపాదించే వ్యక్తులకు రూ.50,000 వరకు బెనిఫిట్స్‌
ప్రస్తుత శ్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం, సంవత్సరానికి రూ. 8 లక్షలు సంపాదించే వ్యక్తి రూ. 30,000 పన్ను చెల్లించాలి. ఇప్పుడు ఆ పరిమితిని పెంచి, రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేసినందున, రూ. 8 లక్షలు సంపాదించే వాళ్లకు నేరుగా రూ. 30,000 ఆదా అవుతుంది. ఇదే విధంగా, రూ. 12,50,000 ఆదాయం ఉన్నవాళ్లు ఈ ఏడాది ఐటీఆర్‌ (ITR 2025) ఫైల్‌ చేసే సమయంలో రూ. 90,000 పన్ను చెల్లించాలి. కొత్త మార్పు ప్రకారం, వచ్చే ఏడాది ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో వాళ్లు రూ. 50,000 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అంటే, రూ. 40,000 ఆదా అవుతుంది. అదేవిధంగా, సంవత్సరానికి రూ. 16,00,000 సంపాదించే వాళ్లు ఇప్పుడున్న పన్ను విధానంలో రూ. 1,70,000 పన్ను చెల్లించాలి, వచ్చే ఏడాది నుంచి అదే ఆదాయంపై రూ. 1,20,000 పన్ను చెల్లించాలి. దీని అర్థం ఈ కేటగిరీ టాక్స్‌ పేయర్లు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 50,000 మిగులుతుంది.


మరో ఆసక్తికర కథనం: