Post Office Savings Schemes: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడని & పెట్టుబడి విషయంలో అసలు రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులే మన దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. నిర్ణీత సమయానికి కచ్చితమైన రాబడిని ఇచ్చే పెట్టుబడులు వాళ్లకు కావాలి. అలాంటి వ్యక్తులకు, పోస్టాఫీసు పథకాలు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు చాలా అనువుగా ఉంటాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే అత్యవసర పరిస్థితుల్లో డబ్బును వెంటనే వెనక్కు తీసుకోవడమే కాకుండా, పొదుపు లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చు. అంతేకాదు, ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ఈ పథకాల్లో పెట్టుబడులకు రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.
పోస్టాఫీస్ పొదుపు ఖాతా (Post Office Savings Account)
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కింద 4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ. 500.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ (National Savings Time Deposit)
ఈ స్కీమ్‌లో పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఏడాది డిపాజిట్లపై 6.90 శాతం, రెండేళ్ల డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లపై 7.10 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.50 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (National Savings Recurring Deposit Account)
ఈ స్కీమ్ కింద ఆదాయ పన్ను కూడా ఆదా చేయొచ్చు. రూ. 100తో ప్రారంభించవచ్చు, పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. దీనిపై 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ (National Savings Monthly Income Account)
ఇందులో జమ చేసే డబ్బుపై వార్షికంగా 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో, సింగిల్ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ.9 లక్షలు కాగా, జాయింట్ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund - PPF)
ఈ ఖాతా తెరిచే పెట్టుబడిదారులకు ఏటా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు కనీసం రూ. 500తో ఖాతా ప్రారంభించొచ్చు, ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి గరిష్ట మొత్తం రూ. 1.50 లక్షలు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme - SCSS)
వృద్ధాప్యంలో దీర్ఘకాలిక పెట్టుబడి కోసం రూపొందించిన ఈ స్కీమ్‌లో, డిపాజిట్ చేసిన తేదీ నుంచి 31 మార్చి/30 సెప్టెంబర్/31 డిసెంబర్, ఏప్రిల్ 01, జులై 01, అక్టోబర్ 01, జనవరి 01న వడ్డీ చెల్లిస్తారు. ఇందులో రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు, రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana - SSY)
ఈ పథకం కింద, మీ దగ్గర రూ. 250 ఉన్నా పొదుపు ప్రారంభించవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై 8.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో, మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra - KVP)
ఈ పథకం కింద రూ. 1000తో ఖాతా స్టార్ట్ చేయొచ్చు, పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఇది ఏటా 7.50 శాతం వడ్డీ ఆదాయాన్ని ఇస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate - NSC)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ నుంచి వార్షికంగా 7.70 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. ఇందులో పెట్టుబడికి కనీస పరిమితి రూ. 1000, గరిష్ట పరిమితి లేదు.
మరో ఆసక్తికర కథనం: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?