Mutual Funds To Invest Modi's 3.0 Reign: నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ ఆధ్వర్యంలో, వరుసగా మూడోసారి NDA కూటమి (Modi 3.0‌ Government) కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మోదీ 3.0 హయాంలో, "వికసిత్‌ భారత్‌" (అభివృద్ధి చెందిన భారత్‌) మీద క్యాబినెట్‌ దృష్టి పెట్టింది. దీన్నుంచి ఏయే పరిశ్రమలు ఎక్కువ లాభపడతాయో తెలుసుకుని, ఆయా రంగాల్లోని మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపు చేయడానికి పెట్టుబడిదార్లు పోటీ పడుతున్నారు. 


వికసిత్‌ భారత్‌ లక్ష్యం కోసం... మౌలిక సదుపాయాలు ‍‌(infrastructure), తయారీ (manufacturing), రక్షణ (defence), రైల్వేలు (railways), జలమార్గాలు (waterways), లాజిస్టిక్స్ (logistics), ఎగుమతులు (exports), ప్రభుత్వ రంగ బ్యాంకులపై (PSU banks) మోదీ సర్కారు ఎక్కువ దృష్టి పెడుతుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. 


మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో (MFs) దీర్ఘకాలిక పెట్టుబడి (కనీసం మూడేళ్లకు తగ్గని పెట్టుబడులు) ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిని మధ్యలో ఆపకుండా, 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ MF పథకాల్లోకి డబ్బును పంప్‌ చేయాలి. ఈ కాలపరిమితి తర్వాత ఆకర్షణీమైన రాబడిని (Return) కళ్లజూడవచ్చు. 


మోదీ 3.0 కాలంలో పెట్టుబడి పెట్టదగిన మ్యూచువల్ ఫండ్స్‌


సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ గౌరవ్ గోయెల్ రికమెండేషన్స్‌ ప్రకారం... 


-- పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
-- నిప్పాన్ ఇండియా టాప్ 100 ఫండ్
-- క్వాంట్ లార్జ్ అండ్‌ మిడ్‌ క్యాప్ ఫండ్
-- క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
-- ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్


ప్రైమ్ వెల్త్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్  కో-ఫౌండర్ & డైరెక్టర్ చక్రవర్తి రికమెండేషన్స్‌ ప్రకారం...


-- HDFC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
-- ICICI ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌
-- SBI బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
-- ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
-- ICICI ప్రుడెన్షియల్ భారత్ కన్జంప్షన్‌ ఫండ్ 
-- SBI కన్జంప్షన్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌
-- ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్ 
-- టాటా డిజిటల్ ఇండియా ఫండ్
-- నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ 
-- SBI హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్


ఫిన్‌ఎడ్జ్‌ కో-ఫౌండర్ & CEO హర్ష్ గహ్లౌట్ రికమెండేషన్స్‌ ప్రకారం...      


--  ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
-- ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్
-- HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!