Highest Fixed Deposit Rates: మన దేశంలో ప్రజలు డబ్బు దాచుకోవడం/ పెట్టుబడి పెట్టడం కోసం ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) ఒకటి. ఇది సంప్రదాయ పెట్టుబడి మార్గం. ప్రస్తుతం, అధిక రెపో రేట్‌ (Repo Rate) కారణంగా బ్యాంక్‌ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో (Highest FD Rates) ఉన్నాయి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఖాతాదార్లు ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతోంది. 


సాధారణ వాణిజ్య బ్యాంక్‌లతో (Regular Commercial Banks) పోలిస్తే స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో (Small finance banks) వడ్డీ రేట్లు కొంచం ఎక్కువగా ఉంటాయి. సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) ఈ రేటు ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు, కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు (SFBs) తమ ఖాతాదార్లకు 9% వరకు ఎఫ్‌డీ రేట్లను ‍‌ఆఫర్‌ చేస్తున్నాయి. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. 


ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks FD Rates May 2024):


- యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 9.00% వడ్డీ అందిస్తోంది.


- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 02 సంవత్సరాల 02 రోజుల టెన్యూర్‌తో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 8.65% వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది.


- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 15 నెలల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీ మీద ఈ SFB 8.50% వడ్డీ ఆదాయం చెల్లిస్తోంది.


- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -  365 రోజుల ఎఫ్‌డీ వేసిన కస్టమర్‌కు 8.50% వడ్డీ రేటును బ్యాంక్‌ ప్రకటించింది.


- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 444 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంపై ఈ బ్యాంక్‌ చెల్లించే వడ్డీ 8.50%.


- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 02 నుంచి 03 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ ఉన్న FDలపై ఈ బ్యాంక్‌లో 8.50% వడ్డీ ఆదాయం అందుకోవచ్చు.


- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 02 నుంచి 03 సంవత్సరాల కాల వ్యవధితో డిపాజిట్‌ చేస్తే ఈ బ్యాంక్‌ నుంచి 8.25% వడ్డీ ఆర్జించొచ్చు.


- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 02 నుంచి 03 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే టర్మ్‌ డిపాజిట్లకు 8.25% వడ్డీ చెల్లిస్తోంది.


- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 18 నెలల టెన్యూర్‌తో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు 8.00% వడ్డీ రేటును ప్రకటించింది.


ఒకవేళ మీరు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో ఎఫ్‌డీ వేయాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. సాధారణ బ్యాంక్‌లతో పోలిస్తే స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల బిజినెస్‌ మోడల్‌ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందవు. SFBల్లో రిస్క్‌ ప్రొఫైల్‌ (పెట్టుబడి నష్టం) కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే... ఇతర బ్యాంక్‌ల తరహాలోనే స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో జమ చేసే డిపాజిట్లకు కూడా "డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్" (DICGC) నుంచి రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ ఉంటుంది. అసలు + వడ్డీ రెండూ కలిపి రూ. 5 లక్షల వరకు కవరేజ్‌ లభిస్తుంది. దురదృష్టవశాత్తు బ్యాంక్‌ దివాలా తీస్తే ఖాతాదార్లకు అసలు + వడ్డీ కలిపి రూ.5 లక్షల వరకు తిరిగి వస్తుంది. కాబట్టి, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి ఈ బీమా పరిమితి (రూ.5 లక్షలు) లోపు ఉండేలా చూసుకోవడం మంచిదన్నది బ్యాంకింగ్‌ నిపుణుల సూచన. 


మరో ఆసక్తికర కథనం: ఫిలిప్పీన్స్‌ మీద అదానీ కన్ను - ఆ దేశంలోనూ జెండా పాతేందుకు ప్లాన్‌