Axis Bank New FD Rates: సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) ఒకటి. ఇందులో, కచ్చితమైన వడ్డీ రేటుతో గ్యారెంటీ రిటర్న్ ఉంటుంది. రిస్క్‌తో కూడిన షేర్‌ మార్కెట్‌, గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు బదులు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు FD మార్గాన్ని ఫాలో అవుతుంటారు.


దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంక్ వెబ్‌సైట్‌ ప్రకారం... తాజా FD రేట్లతో సీనియర్ సిటిజన్లు 7.60% రిటర్న్‌ తీసుకోవచ్చు. అదే సమయంలో సాధారణ ప్రజలు 7.10% వరకు ఆర్జించొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కొత్త FD వడ్డీ రేట్లు 12 అక్టోబర్ 2023 నుంచి అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా కొనసాగిస్తూ ప్రకటించిన తర్వాత యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 6న జరిగిన MPC మీటింగ్‌లో తీసుకున్న డెసిషన్‌ ప్రకారం, రెపో రేటును వరుసగా నాలుగోసారి యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగించింది.


యాక్సిస్ బ్యాంక్ కొత్త FD రేట్లు


7 రోజుల నుంచి 29 రోజుల్లో చెల్లించాల్సిన డిపాజిట్లపై 3% వడ్డీ రేటు 
30 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.50% వడ్డీ రేటు 
46 రోజుల నుంచి 60 రోజుల టర్మ్‌ డిపాజిట్ల మీద 4.25% వడ్డీ రేటు 
61 రోజుల నుంచి 3 నెలల కాల పరిమితి FDలపై 4.50% వడ్డీ రేటు
3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంచిన డిపాజిట్ల మీద 4.75% వడ్డీ రేటు 
6 నెలల నుంచి 9 నెలల వరకు ఉన్న FDలపై 5.75% వడ్డీ రేటు 
9 నెలల నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే FDలపై 6% వడ్డీ రేటు
1 సంవత్సరం 1 రోజు నుంచి 15 నెలల టెన్యూర్‌తో ఉన్న డిపాజిట్లపై 6.70% వడ్డీ రేటు
15 నెలల 1 రోజు నుంచి 5 సంవత్సరాల్లో కాల పరిమితి గల డిపాజిట్ల మీద 7.10% వడ్డీ రేటు 
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలు కొనసాగించిన డిపాజిట్లపై 7% వడ్డీ రేటు


నెట్ బ్యాంకింగ్‌ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కనీసం 5,000 రూపాయలతో యాక్సిస్ బ్యాంక్‌లో FD ఖాతాను తెరవవచ్చు. బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళితే కనీసం రూ. 10,000 ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేయాలి. మీ డబ్బును ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కదల్చకుండా బ్యాంకులో ఉంచవచ్చు, కచ్చితమైన వడ్డీ రేటుతో మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. 


దీంతోపాటు, యాక్సిస్ బ్యాంక్‌లో చేసే రూ. 1.5 లక్షల వరకు విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద టాక్స్‌ ఎగ్జమ్షన్‌ ఉంటుంది. టాక్స్ బెనిఫిట్‌ కోసం పన్ను ఆదా FD (tax-saving Fixed Deposit) చేయాలి. 5 సంవత్సరాల లాక్-ఇన్‌తో కూడిన టాక్స్‌ సేవింగ్‌ FDపై 7.10% వడ్డీని ఇప్పుడు యాక్సిస్‌ బ్యాంక్ చెల్లిస్తోంది.


ఒకవేళ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మీకు డబ్బు అవసరమైతే, "ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లస్" కిందకు రాని FDలను ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కేస్‌లో బ్యాంక్‌ చెల్లించే వడ్డీ రేటు, డిపాజిట్ తేదీ నాటికి ఉన్న కార్డ్ రేటు కంటే 1% తక్కువగా ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial