Income Tax Returns Filing in Assessment Year 2023-24: మన దేశంలో, ఆదాయ పన్ను పత్రాల దాఖలులో (ITR Filing) కొత్త రికార్డ్‌ నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, దేశంలో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 8 కోట్లు దాటింది. 


ఐటీఆర్‌లతో పాటు ఇతర ఫామ్స్‌లోను రికార్డ్‌ 
ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం.. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో (Assessment Year 2023-24) మొత్తం 8.18 కోట్ల ITRలు దాఖలయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 7.51 కోట్లుగా ఉంది. ఇన్‌కమ్‌ టాక్స్ రిటర్న్స్‌ ‍‌దాఖలు చేసిన వారి సంఖ్య ఈ ఏడాది కాలంలో దాదాపు 9 శాతం పెరిగింది. అంతేకాదు, 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో మొత్తం 1.60 కోట్ల ఆడిట్ రిపోర్ట్‌లు, ఇతర ఫారాలను సబ్మిట్‌ చేశారు. గత ఏడాది ఈ సంఖ్య 1.43 కోట్లుగా ఉంది.






సులభంగా మారిన ఐటీఆర్ ప్రక్రియ
మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం... జీతం, వడ్డీ, డివిడెండ్, వ్యక్తిగత సమాచారం, TDS సహా పన్ను చెల్లింపు, నష్టం, MAT క్రెడిట్ సహా చాలా రకాల సమాచారం ప్రి-ఫిల్డ్‌ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో, ITR ఫైల్ చేసే ప్రక్రియ మునుపటి కంటే చాలా సులభంగా, సౌకర్యవంతంగా, వేగంగా మారింది. ఈ సౌకర్యాన్ని అసెసీలు విస్తృతంగా ఉపయోగించుకున్నారు, రికార్డ్‌ స్థాయిలో పన్ను పత్రాలు దాఖలు చేశారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి                         


ప్రభుత్వం ఇమెయిల్ మరియు SMS సహా అనేక సృజనాత్మక ప్రచారాలను నిర్వహించింది.
ITR సహా ఇతర ఫారాలను సులభంగా, త్వరగా పూరించేలా ఐటీ డిపార్ట్‌మెంట్‌ తీసుకొచ్చిన సంస్కరణలు (Reforms in ITR Filing) విజయవంతం అయ్యాయని చెప్పడానికి ఈ నంబర్లు ఉదాహరణ. ఐటీఆర్‌ ప్రక్రియ సరళీకరణపై కేంద్ర ప్రభుత్వం ఇ-మెయిల్, SMS, అనేక ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారాలను నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.


2023 డిసెంబరు 31న, దాదాపు 27.37 లక్షల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు ఇ-ఫైలింగ్‌ సహాయ కేంద్రం ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Auto stocks, LIC, SJVN