Revised ITR Filing: ప్రస్తుతం, ఇన్‌టాక్స్‌ రూల్స్‌ కఠినంగా ఉన్నాయి. టాక్స్‌ పేయర్ తన పన్ను బాధ్యత నుంచి తప్పించుకోకుండా, తప్పుడు క్లెయిమ్స్‌ చేయకుండా ఐటీ డిపార్ట్‌మెంట్‌ చాలా గట్టి చర్యలు తీసుకుంటోంది. అలాగే, డిపార్ట్‌మెంట్‌ నుంచి రావలసిన రిఫండ్‌ తక్కువగా వచ్చినా, దానిపై అప్పీల్‌ చేయడానికి కూడా అనుమతి ఇస్తోంది. దీనికి సంబంధించి ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లో రూల్‌ ఉంది.


139(5) కింద రివైజ్డ్‌ రిటర్న్ ఫైలింగ్‌
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం, ఒకసారి టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేసిన తర్వాత కూడా మీరు మీ ITR సరిచేసుకోవచ్చు. తద్వారా, ఐటీఆర్‌లో దొర్లిన తప్పులను కరెక్ట్‌ చేసుకోవచ్చు. ITR ఫైల్ చేసిన తర్వాత, ఏదైనా ఆదాయాన్ని ప్రకటించడం మిస్ అయ్యానని లేదా ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పన్ను చెల్లింపుదారు భావిస్తే, ఈ రూల్‌ ప్రకారం అతను రివైర్డ్‌ రిటర్న్‌ దాఖలు చేసి ITRను సరిదిద్దొచ్చు.


రిఫండ్‌ వచ్చిన తర్వాత కూడా రివైజ్డ్ రిటర్న్ నింపొచ్చు
రివైజ్డ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయొచ్చని టాక్స్‌ పేయర్లలో చాలా మందికి తెలుసు. అయితే, సబ్మిట్‌ చేసిన ఆదాయ పన్ను పత్రాలను ఐటీ డిపార్ట్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ చేయకముందే దానిని అప్‌డేట్‌ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఒక టాక్స్ పేయర్‌ సబ్మిట్‌ చేసిన ITR ప్రాసెసింగ్ కంప్లీట్‌ అయిన తర్వాత కూడా రివైర్డ్‌ ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి వీలవుతుంది. ఇది మాత్రమే కాదు, ఒకవేళ అతనికి రిఫండ్‌ రావలసి ఉంటే, ఆ రిఫండ్‌ అతని బ్యాంక్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అయిన తర్వాత కూడా ITRను సరిచేయడానికి, రివైజ్డ్‌ రిటర్న్‌ సమర్పించడానికి అవకాశం ఉంది.


అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసే మూడు నెలల ముందు వరకు, రివైజ్డ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్‌ 2023-24 లో మీరు ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేశారు, దానిలో ఒక పొరపాటు జరిగిందని అనుకుందాం. దానిని సరి చేయాలని మీరు భావిస్తే, అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసే మూడు నెలల ముందు వరకు మీకు ఛాన్స్‌ ఉంటుంది. అంటే, ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు, రివైజ్డ్‌ ఐటీఆర్‌ను ఫైల్ చేయవచ్చు. ఇదే కాదు, ఈ నెల 31లోపు రిటర్న్‌ ఫైల్‌ చేయలేకపోయిన వాళ్లు కూడా బీలేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించేందుకు డిసెంబర్‌ 31 వరకు అవకాశం ఉంది. 2019-20 వరకు, రివైజ్డ్‌ రిటర్న్‌ దాఖలు చేయడానికి మార్చి 31 వరకు సమయం ఉండేది. ప్రభుత్వం ఆ గడువును మూడు నెలలు తగ్గించి డిసెంబర్ 31కి కుదించింది.


తక్కువ రిఫండ్‌ వస్తే ఏం చేయాలి?
మీరు ITR ఫైల్ చేసి, క్లెయిమ్ చేసిన దాని కంటే తక్కువ రిఫండ్‌ పొందారని అనుకుందాం. అప్పుడు, ఆదాయ పన్ను చట్టం కింద ఐటీ డిపార్ట్‌మెంట్‌కి అప్పీల్ చేసే హక్కు మీకు ఉంటుంది. ఫామ్ 26ASలో TDS క్రెడిట్ చూపిస్తున్నప్పటికీ పన్ను చెల్లింపుదారు తక్కువ టాక్స్‌ రిఫండ్‌ రిసీవ్‌ చేసుకుంటే, అతను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 154 ప్రకారం కరెక్షన్‌ రిక్వెస్ట్‌ పెట్టుకోవచ్చు. తద్వారా బ్యాలెన్స్ రిఫండ్‌ కోసం క్లెయిమ్ చేయొచ్చు. ఇలాంటి అభ్యర్థలను ఆదాయ పన్ను విభాగం పరిశీలిస్తుంది, నిజంగానే టీడీఎస్‌ బ్యాలెన్స్‌ ఉంటే దానిని జారీ చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ - ఈ ఫీచర్‌తో మామూలుగా ఉండదు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial