Importance of Two Wheeler Insurance bike insurance benefits: బైక్ ఇన్సూరెన్స్ అనగానే చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. తర్వాత రెన్యువల్ చేద్దాం లే అనుకుంటారు. రోజువారీ పనుల్లో పడిపోయి ఆ విషయం మర్చిపోతుంటారు. చివరికి రోడ్డు మీద పోలీసులు ఆపగానే అరెరె! అనుకుంటారు. వాస్తవానికి బైక్ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
* ద్విచక్ర వాహనాల బీమాపై 2018లో సుప్రీకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సహకారంతో ఐదేళ్ల పాటు బీమా కవర్ చేయాలి. అందుకే కొత్త బైక్ కొనగానే ఐదేళ్ల బీమా ప్రీమియం కట్టించుకుంటారు.
* సరైన బీమా లేకుండా వాహనాలను రోడ్ల మీద తిప్పితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారుడు బీమా తీసుకోవడం అవసరం.
* హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో చాలామంది వాహనాలు మునిగిపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి. ఇవే కాకుండా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి విపత్తుల వల్ల వాహనదారులకు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చుల నుంచి బీమా రక్షిస్తుంది.
* ప్రకృతి విపత్తులే కాకుండా మానవ తప్పిదాలూ జరుగుతుంటాయి. దొంగతనాలు, దోపిడీ, యుద్ధాల వాహనాలకు నష్టం జరుగుతుంది. ఇలాంటివి బైక్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి.
* కొన్నిసార్లు మన బైక్‌ను బంధువులు, మిత్రులు తీసుకెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదం జరిగితే చట్ట పరంగా బీమా రక్షిస్తుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
* బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక రెగ్యులర్‌గా రెన్యువల్ చేయించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నో క్లెయిమ్ బోనస్ (NCB) వంటి రాయితీలకు అర్హత వస్తుంది. మీరు క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి కొంత బోనస్ వస్తుంది. అంటే మీరు సురక్షితంగా మీ వాహనాన్ని నడిపినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్న గిఫ్ట్ ఇది. రెన్యువల్ సమయంలో ఎక్కువ ఎన్‌సీబీ ఉంటే చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది.
* రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బీమా ద్వారా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ లభిస్తుంది. చట్ట ప్రకారం దీనిని కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాత వాహనంపై పర్సనల్ యాక్సిడెంట్ ప్రయోజనం ఉన్నా కొత్త వాహనం కొంటే మళ్లీ కవరేజీ తీసుకోవాలి.
* గతంలో ఏటా బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉండేది. అందుకే మూడేళ్ల కాలానికి తీసుకోవడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది. తక్కువ డబ్బే ఖర్చవుతుంది. ఏటా పెరిగే ప్రీమియం నుంచి రక్షణ లభిస్తుంది.