Radhakishan Damanis wealth falls by a quarter in 2022 as growth stocks take hit : వెటరన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌, డీమార్ట్‌ (D Mart) యజమాని రాధాకిషన్‌ దమానీ (Radhakrishna Damani) తన సంపదలో చాలాభాగం నష్టపోయారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 శాతం సంపద కోల్పోయారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉండటం, స్టాక్‌ మార్కెట్లు ఎక్కువగా పతనమవ్వడమే ఇందుకు కారణం.


2022, మార్చి 31 నాటికి దమానీకి 14 లిస్టెడ్‌ కంపెనీల్లో ఒక శాతానికి పైగా వాటాలు ఉన్నాయి. ట్రెండ్‌లైన్‌ నివేదిక ప్రకారం ఈ మొత్తం విలువ ప్రస్తుతం రూ.1.55 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో తన సొంత కంపెనీ డీమార్ట్‌ కూడా ఉంది. 2021, డిసెంబర్‌ 31 నాటికి దమానీ షేర్ల విలువ రూ.2.02 లక్షలు కోట్లు. కొత్త ఏడాదిలో తన పోర్టుపోలియోలో ఆయన ఏమాత్రం మార్పు చేర్పులు చేపట్టలేదు. యథావిధిగా కొనసాగించడంతో రూ.50వేల కోట్ల మేరకు నష్టపోయారు.


డీమార్ట్‌లో దమానీకి 65.2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఈ మొత్తం విలువ రూ.147966 కోట్లు. ఆయన పెట్టుబడి పెట్టిన షేర్లు ఈ ఏడాదిలో 25 శాతం పతనం అయ్యాయి. దాంతో ఆయన సంపద రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు తగ్గిపోయింది. మార్చి 31 నాటికి వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో ఆయనకు 32.5 శాతం స్టేక్‌ ఉంది. దీని విలువ రూ.1,619 కోట్లు. ఇండియా సిమెంట్స్‌లో ఆయన వాటా విలువ 17 శాతం తగ్గింది. ట్రెంట్‌ విలువ 2 శాతం, యునైటెడ్‌ బ్రూవరీస్‌ 6, సుందరం ఫైనాన్స్‌ 33, త్రీఎం ఇండియా 32, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ 53 శాతం తగ్గింది. సుందరం ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌ 9, ఆంధ్రా పేపర్స్‌ 2, బీఎఫ్‌ యుటిలిటీస్‌ 23, మంగళం ఆర్గానిక్స్‌ 40 శాతం తగ్గింది.


Also Read: రూ.10 వేల సిప్‌ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్‌ ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ ఇది


Also Read: వరుసగా రెండో వీకెండ్‌ లాభాలే లాభాలు! సెన్సెక్స్‌ 632+, నిఫ్టీ 182+


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.