Stock Market Closing Bell on 27 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆరంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బంగారం ధర స్థిరపడటం, అమెరికన్లు డాలర్‌ను పక్కన పెట్టి స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుండటం, ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఓపెనవ్వడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక అన్ని షేర్లకు డిమాండ్‌ మరింత పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,352 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 632 పాయింట్లు లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 54,252 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,671 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఆరంభం నుంచే కొనుగోళ్ల ఊపు కనిపించింది. 54,449 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు తెరిచాక 54,936 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 632 పాయింట్ల లాభంతో 54,884 వద్ద ముగిసింది.


Also Read: రూ.10 వేల సిప్‌ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్‌ ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ ఇది


NSE Nifty


గురువారం 16,170 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,296 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల్లో ఉంది. 16,221 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,370 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 182 పాయింట్ల లాభంతో 16,352 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం భారీ లాభాలు నమోదు చేసింది. ఉదయం 35,326 వద్ద మొదలైంది. 35,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,694 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 518 పాయింట్ల లాభంతో 35,613 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఎక్కువ కొనుగోళ్లు కనిపించాయి.