Residential Properties Sale: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (2023 జనవరి-జూన్) హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రీబౌన్స్ అయింది. 2022లోని మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈసారి ఇళ్ల అమ్మకాలు ఏకంగా 69 శాతం పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు, దేశంలోని టాప్ మెట్రో సిటీస్‌లోనూ రెసిడెన్షియల్ మార్కెట్ రైజింగ్‌లో ఉంది.
2023 తొలి అర్ధ భాగంలో, టాప్ మెట్రో నగరాల్లో 1,26,587 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. అంతేకాదు, ఇది 15 సంవత్సరాల గరిష్ట స్థాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్ ( JLL) ఈ డేటాను విడుదల చేసింది.
మెట్రో నగరాల వారీగా హౌసింగ్ సేల్స్
2023 జనవరి-జూన్ కాలంలో, బెంగళూరులో అత్యధికంగా 26,625 రెసిడెన్షియల్ యూనిట్లు చేతులు మారాయి. ఇది 14 శాతం వృద్ధి. 2022 జనవరి-జూన్ కాలంలో 23,452 యూనిట్లు అమ్ముడయ్యాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26,188 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022లోని ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. ముంబైలో, 2022 జనవరి-జూన్ కాలంలో 23,802 యూనిట్లు అమ్ముడయ్యాయి.
పుణెలో 25,201 ఇళ్లను ప్రజలు కొనుగోలు చేశారు. 2022లోని ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 పర్సెంట్ గ్రోత్. పుణెలో, 2022 జనవరి-జూన్ కాలంలో 16,802 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్‌లో, 2023 జనవరి-జూన్ కాలంలో 15,925 హౌసింగ్ యూనిట్ల సేల్స్ జరిగాయి. 2022లోని ఇదే కాలంతో పోలిస్తే ఇది 69 శాతం వృద్ధి. ఇక్కడ, 2022 జనవరి-జూన్ కాలంలో 9,449 యూనిట్లు అమ్ముడయ్యాయి.
చెన్నైలో, 2023 ఫస్ట్ హాఫ్‌లో 7,319 గృహ విక్రయాలు నమోదయ్యాయి. 2022లోని ఇదే కాలంతో పోలిస్తే ఇది 47 శాతం పెరుగుదల. ఈ మెట్రో నగరంలో, 2022 జనవరి-జూన్ కాలంలో 4,968 యూనిట్లు అమ్ముడయ్యాయి.
దేశ రాజకీయ రాజధాని దిల్లీ NCRలో, 2022 తొలి అర్ధ భాగంలో 18,709 ఇళ్లు అమ్ముడయితే, 2023 తొలి అర్ధ భాగంలో 19,507 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 4 శాతం పెరుగుదల కనిపించింది.
దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్లయిన ముంబై, బెంగళూరు... టాప్ మెట్రో నగరాల మొత్తం సేల్స్‌లో (1,26,587 యూనిట్లు) తలో 21 శాతం కాంట్రిబ్యూట్ చేశాయి. పుణె 20 శాతంతో వాటా అందించింది. అంటే, మొత్తం అమ్మకాల్లో కేవలం ఈ 3 నగరాలే దాదాపు 62 శాతం వాటాతో ఉన్నాయి.
“భారత ప్రభుత్వం నుంచి బలమైన ప్రోత్సాహం, గత రెండు RBI MPC సమావేశాల్లోనూ రెపో రేటును పాజ్ చేయడం, తగ్గుతున్న ద్రవ్యోల్బణం వంటివి రెసిడెన్షియల్ మార్కెట్‌ను పెంచడంలో పెద్ద పాత్ర పోషించాయి. రాబోయే పండుగల సీజన్, పాజిటివ్ కస్టమర్ సెంటిమెంట్‌తో, ఈ సంవత్సరం సెకండ్ హాఫ్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం" - శివ కృష్ణన్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ & హెడ్ JLL
గత 18 నెలల కాలంలో ప్రారంభమైన ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఎక్కువ ఇళ్ల విక్రయాలు జరిగాయి.
ప్రీమియం ఫ్లాట్లకు ఎక్కువ డిమాండ్
ప్రస్తుతం, ప్రీమియం ఫ్లాట్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నట్లు జేఎల్‌ఎల్ వెల్లడించింది. ఈ కంపెనీ రిపోర్ట్ ప్రకారం... 2023 జనవరి-జూన్ కాలంలో, దేశంలోని టాప్ మెట్రో సిటీస్‌లో రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్ల సేల్స్ దాదాపు 50 శాతం పెరిగాయి. 2022 జనవరి- జూన్ కాలంలో 33,477 ప్రీమియం ఫ్లాట్లు అమ్ముడయితే, ఈ ఏడాది జనవరి- జూన్‌లో 50,132కు పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: గ్రోత్ స్టాక్స్ - బ్రోకరేజీలు వీటిని గట్టిగా నమ్ముతున్నాయి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial