KRN Heat IPO Shares Allotment Checking Online: ప్రస్తుతం, ప్రైమరీ మార్కెట్‌లో కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ జపం జరుగుతోంది. 3-రోజుల బిడ్డింగ్ టైమ్‌లో పెట్టుబడిదార్లు ఈ కంపెనీ షేర్ల కోసం ఎగబడ్డారు, కోకొల్లలుగా బిడ్స్ వేశారు. KRN హీట్ ఎక్స్ఛేంజర్ IPOలో విజయవంతమైన బిడ్డర్స్‌కు షేర్లను ఈ రోజు (30 సెప్టెంబర్ 2024) కేటాయిస్తారు. సెప్టెంబర్ 30 నాటికి, షేర్ GMP మూడంకెల శాతం లిస్టింగ్ గెయిన్స్‌ను సూచిస్తోంది.
కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ ఐపీవోలో మీరు కూడా బిడ్ వేసి ఉంటే, షేర్ కేటాయింపు స్థితిని BSE, NSE, కంపెనీ రిజిస్ట్రార్ అయిన బిగ్‌షేర్ సెక్యూరిటీస్ వంటి వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు.
కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్' సెప్టెంబర్ 25-27 తేదీల్లో జరిగింది. ఈ ఆఫర్‌లో రూ.341.95 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేశారు. QIB, NII, రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి, మొత్తంగా 213.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ IPO ప్రైస్ బ్యాండ్ ప్రకారం ఒక్కో షేర్‌ను రూ.209 నుంచి రూ.220 వరకు అమ్మకానికి పెట్టారు.
KRN హీట్ ఎక్స్ఛేంజర్ IPO అలాట్‌మెంట్ స్టేట్‌ను ఇలా చెక్ చేయొచ్చు:
బిగ్‌షేర్ సర్వీసెస్ వెస్‌సైట్‌లో..
https://www.bigshareonline.com/ipo_Allotment.html లింక్ ద్వారా బిగ్‌షేర్ సర్వీసెస్ (Bigshare Services) వెస్‌సైట్‌లో మీ అప్లికేషన్ స్టేటస్‌ను తనిఖీ చేయొచ్చు. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత, కేటాయింపు స్థితిని చూడడానికి మూడు సర్వర్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ, పెట్టుబడిదార్లు కంపెనీ పేరును (KRN Heat Exchanger) ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ పాన్, అప్లికేషన్ నంబర్ లేదా బెనిఫిషియరీ ఐడీ వివరాలు యాడ్ చేయండి. చివరగా, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఇప్పుడు, మీ IPO అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి SEARCH బటన్ మీద క్లిక్ చేయండి. వివరాలు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి.
బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో...
BSEలో అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి https://www.bseindia.com/investors/appli_check.aspx లింక్‌ను ఉపయోగించండి. ఈ లింక్ ఓపెన్ కాగానే, 'Issue Type' ఆప్షన్ కింద 'Equity'ని ఎంచుకోండి. డ్రాప్‌డౌన్ మెనూలోని 'Issue Name' మీద క్లిక్ చేసి 'KRN Heat Exchanger' IPOని ఎంచుకోవాలి. ఇక్కడ, మీ PAN కార్డ్ వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. మీ అప్లికేషన్ స్థితిని వీక్షించడానికి 'SEARCH'పై క్లిక్ చేయండి.
కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ IPO GMP
ఇన్వెస్టర్ గ్రెయిన్ రిపోర్ట్ ప్రకారం, KRN హీట్ ఎక్స్ఛేంజర్ IPO లేటెస్ట్ 'గ్రే మార్కెట్ ప్రీమియం' (GMP) రూ.270. సెప్టెంబర్ 29 అర్ధరాత్రి సమయంలో ఈ ప్రీమియం నడిచింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.220 + GMP రూ.270 కలుపుకుని, KRN హీట్ ఎక్స్ఛేంజర్ IPO రూ.490 దగ్గర లిస్ట్ కావచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటే, ఒక్కో షేరుకు 122.73% లిస్టింగ్ గెయిన్స్‌ను ఆశించొచ్చు.
షేర్లు ఎప్పుడు లిస్ట్ అవుతాయి?
విన్నింగ్ బిడ్డర్ల డీమ్యాట్ అకౌంట్లలోకి అక్టోబర్ 01వ తేదీన షేర్లు జమ అవుతాయి. 02న గాంధీ జయంతి సందర్భంగా షేర్ మార్కెట్లు పని చేయవు కాబట్టి, KRN IPO షేర్లు అక్టోబర్ 03వ తేదీన మార్కెట్లలో లిస్ట్ అవుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్ - ఫైలింగ్ తేదీని పెంచిన ఐటీ డిపార్ట్‌మెంట్