Income Tax Audit Report Submission Date Extended: ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులకు భారీ ఊరట లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), గత సంవత్సరం అంటే 2023-24కి సంబంధించిన వేర్వేరు ఆడిట్ రిపోర్ట్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. వాస్తవానికి, ఆదాయ పన్ను ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి ఈ రోజుతో (30 సెప్టెంబర్ 2024‌) గడువు ముగుస్తుంది. అయితే, కొంతమంది పన్ను చెల్లింపుదార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను (Technical issues while filing income tax audit report) దృష్టిలో ఉంచుకుని ఆదాయ పన్ను విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.


చివరి తేదీని ఎప్పటి వరకు పొడిగించారు?        
ఆదాయ పన్ను ఆడిట్ రిపోర్ట్‌ ఫైల్‌ చేయడానికి చివరి తేదీని ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ (Income tax department) మరో వారం రోజులు పొడిగించింది. పొడిగించిన కొత్త తేదీ ప్రకారం, 07 అక్టోబర్ 2024 వరకు ఆడిట్‌ రిపోర్ట్‌ సమర్పించడానికి సమయం ఉంది. ఆడిట్ రిపోర్టులను దాఖలు చేయడంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌ విధానంలో టాక్స్‌ పేయర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పొడింగింపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అయింది. నిజానికి, గత చివరి తేదీ (30 సెప్టెంబర్ 2024‌) దగ్గర పడుతున్నకొద్దీ దేశవ్యాప్తంగా టాక్స్‌ పేయర్లు చాలా టెన్షన్‌ పడ్డారు. అయితే, చివరి తేదీ పూర్తికాక ముందే CBDT నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ఇంకా ఆడిట్ నివేదికలు సమర్పించని పెద్ద సంఖ్యలో ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించింది.  






మరో ఆసక్తికర కథనం: సెన్సెక్స్‌ 700 పాయింట్స్‌ డౌన్‌ - నిరాశలో నిఫ్టీ బ్యాంక్‌, ఐటీ - ప్రకాశిస్తున్న లోహాలు 


పన్ను చెల్లింపుదార్లు ఆడిట్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?       
ఆడిట్ పూర్తయిన పన్ను చెల్లింపుదార్లు ముందుగా ఆడిట్ నివేదికను ఫైల్ చేయాలి, దీంతోపాటే పన్నును కూడా జమ చేయాలి. నిర్దేశిత గడువులోగా పన్ను చెల్లింపుదార్లు ఆడిట్ రిపోర్ట్‌ను సమర్పించడంలో విఫలమైతే, వారిపై విధించే జరిమానా రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. అందువల్లే దేశవ్యాప్తంగా టాక్స్‌ పేయర్లు టెన్షన్‌ పడ్డారు. ఇప్పుడు, చెల్లింపుదార్లకు మరో 7 రోజుల సమయం ఉంది. తద్వారా, తప్పులు సవరించుకుని ప్రశాంతంగా ఆడిట్ రిపోర్ట్‌ను ఫైల్ చేయవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని (Income tax act) 139 సబ్-సెక్షన్ (1) ప్రకారం ఆదాయపు పన్ను విభాగం చివరి తేదీని పొడిగించింది.


మరో ఆసక్తికర కథనం: సిప్‌-ఆర్‌డీ, ఎఫ్‌డీ-ఆర్‌డీ - ఒకే స్కీమ్‌తో రెండు ప్రయోజనాలు!