Check Your Credit Score For Free On PhonePe: బ్యాంక్ లోన్ (Bank loan) లేదా క్రెడిట్ కార్డ్ (Credit card) పొందాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. క్రెడిట్ స్కోర్ 'గుడ్' లేదా 'ఎక్స్‌లెంట్' రేంజ్‌లో ఉంటే చాలా త్వరగా, తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్ లోన్లు, మంచి ఆఫర్స్‌తో క్రెడిట్ కార్డులు దొరుకుతాయి.
ఇక, UPI (Unified Payments Interface) ద్వారా డబ్బు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఫోన్‌పే (PhonePe), గూగుల్‌పే (GPay), పేటీఎం (Paytm) వంటి యాప్స్ ఉంటాయి. మీరు, మీ క్రెడిట్ స్కోర్‌ను ఫోన్‌పే ద్వారా ఉచితంగా చెక్ చేసుకోవచ్చు.
డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లింపు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ఆఫర్స్ సహా యూజర్లకు చాలా ఫీచర్లను ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే అందిస్తోంది. వీటిలో భాగంగా, క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే (check your credit score for free) ఫెసిలిటీని కూడా ఈ మధ్యే ప్రవేశపెట్టింది. క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను బ్యాంక్‌ల ద్వారా తీసుకోవాలంటే కొంత ఫీజ్ + GST చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ పూర్తి ఉచితం
ఏ బ్యాంక్/సంస్థకు ఒక్క రూపాయి కూడా కట్టకుండా, ఇప్పుడు ఫోన్‌పేలో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకోవచ్చు. అయితే, దీనికి ఒక్క నిబంధన ఉంది. ఫోన్‌పేలో లాగిన్ అయిన ఫోన్ నంబర్, పాన్ కార్డ్‌తో (Pan Crad) లింక్ అయిన ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ కనిపిస్తుంది.
ఫోన్‌పేలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండిలా...
ఫోన్‌పేలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం చాలా ఈజీ. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయగానే, హోమ్‌పేజీలో, కింద వైపు ‘క్రెడిట్’ (Credit) అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీ రూపాయి గుర్తు (₹) కూడా ఉంటుంది. ఒకవేళ, మీ ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ బటన్ కనిపించకపోతే కంగారు పడాల్సిన పని లేదు. యాప్‌ను అప్‌డేట్ చేయండి, ఆ వెంటనే క్రెడిట్ బటన్ కనిపిస్తుంది. క్రెడిట్ బటన్‌ను నొక్కగానే ‘క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ’ (Credit score for free) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద ‘చెక్ నౌ’ (Check now) అనే మరో బటన్ కూడా ఉంటుంది, దానిని టచ్ చేయాలి.
మీ క్రెడిట్ స్కోర్‌ను సేకరించడానికి, ఫోన్‌పే కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. వాటిని OK చేయాలి. అవసరమైన పర్మిషన్లు ఇవ్వగానే, మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్ (Experian) క్రెడిట్ బ్యూరో అందిస్తోంది.
ఇక్కడ, క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు... ఆన్ టైమ్ పేమెంట్స్ (On Time Payments), క్రెడిట్ యుటిలైజేషన్ (Credit Utilization), క్రెడిట్ ఏజ్ (Credit Age), క్రెడిట్ మిక్స్ (Credit Mix), క్రెడిట్ ఎంక్వైరీస్ (Credit Inquiries) వంటి ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే, మీ క్రెడిట్ హిస్టరీ గురించి మరింత సమగ్రమైన సమాచారం తెలుస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తగ్గితే, ఎందుకు తగ్గిందనే విషయం వీటి ద్వారా మీకు అర్ధం అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు, సెబీ చేతికే దర్యాప్తు, అదానీకి అతి పెద్ద ఊరట