RBI On Fixed Rate Loans: ఈ ఆర్థిక సంవత్సరంలోని జరిగిన మూడో MPC (Monetary Policy Committee) మీటింగ్‌లోనూ రెపో రేట్ పెంచకుండా ఊరట ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్, అంతకుమించిన శుభవార్త మరొకటి చెప్పింది.
గురువారం (10 మార్చి 2023) నాటి ప్రకటనలో, రెపో రేట్‌ను పెంచకుండా 6.50% వద్దే యథాతథంగా కొనసాగిస్తూ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఇస్తున్న గృహ రుణం (floating rate home loan), ఇతర రుణాల విషయంలో పారదర్శకతను తీసుకువచ్చేలా మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das), ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను రీసెట్ చేసే ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చే ప్లాన్ గురించి ప్రకటించారు.
ఆర్‌బీఐ గవర్నర్ చెప్పిన ప్రకారం... హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ సహా అన్ని రకాల దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న కస్టమర్లు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు విధానం నుంచి స్థిర వడ్డీ రేటుకు (fixed rate loan) మారవచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకటించనున్నట్లు దాస్ చెప్పారు.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి ఫిక్స్‌డ్ వడ్డీ రేటుకు మారితే ఏంటి లాభం?
బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, లెండింగ్ యూనిట్లు, తాము ఇచ్చే గృహ రుణం సహా లాంగ్ టర్మ్ లోన్ల మీద ప్రస్తుతం ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల, రెపో రేటు మారినప్పుడల్లా లోన్ రేట్లు కూడా మారుతున్నాయి, రుణగ్రహీతల మీద EMIల భారం పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ట్రిక్ ప్లే చేస్తున్నాయి. పెరిగిన లోన్ రేట్‌కు తగ్గట్లుగా EMI మొత్తాన్ని పెంచకుండా, లోన్ టెన్యూర్‌ను పెంచుతున్నాయి. అంటే, కట్టాల్సిన EMIల సంఖ్యను పెంచుతున్నాయి. కస్టమర్‌కు తెలీకుండానే ఈ మార్పులు చేస్తున్నాయి. లోన్ కాల గడువు పెరగడం వల్ల, కట్టాల్సిన వడ్డీ మొత్తం కూడా అదనంగా పెరుగుతోంది. ఖాతాదార్లు ప్రత్యేకంగా వాకబు చేస్తేనే లేదా గమనిస్తేనే ఇది తెలుస్తోంది. బ్యాంక్‌లు చేస్తున్న ఇలాంటి పనులపై ఆర్‌బీఐకి చాలా కంప్లయింట్స్ కూడా అందాయి.
ఆర్‌బీఐ తీసుకొచ్చే ఫ్రేమ్‌వర్క్ ప్రకారం... బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, లెండింగ్ యూనిట్లు EMIని రీసెట్ చేసేటప్పుడు లేదా దాని టెన్యూర్ మార్చేటప్పుడు కస్టమర్లకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అంతేకాదు, ఫ్లోటింగ్ రేట్ లోన్ సిస్టమ్ నుంచి ఫిక్స్‌డ్ రేట్ లోన్ సిస్టమ్‌కు మారే ఆప్షన్ కూడా కస్టమర్లకు ఇవ్వాలి. దీంతోపాటు, లోన్ ముందస్తు చెల్లింపులకు (Pre-payments) కూడా అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ రేట్ నుంచి ఫిక్స్‌డ్ రేట్‌కు మారడం, ప్రీమెంట్లు చేయడం, ఇతర ఆప్షన్లు వంటి వాటిపై వసూలు చేసే ఛార్జీల గురించి కూడా బ్యాంక్‌లు తమ ఖాదాదార్లకు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల, లోన్ రిసీవర్ల ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి.
మళ్లీ జరిగే MPC మీటింగ్ (అక్టోబర్) వరకు RBI రెపో రేట్ 6.50% వద్దే కొనసాగుతుంది. రెపో రేట్‌ను కేంద్ర బ్యాంక్ పెరగలేదు కాబట్టి, కమర్షియల్ బ్యాంకులు కూడా తమ లోన్ల మీద ఇంట్రస్ట్ రేట్లను పెంచకపోవచ్చు. ఫలితంగా... ఇప్పటికే తీసుకున్న, కొత్తగా తీసుకోబోతున్న అప్పులపై వడ్డీల భారం EMI మొత్తం పెరిగే అవకాశం దాదాపుగా ఉండదు.
UPI లైట్ పేమెంట్స్ పరిమితి ₹200 నుంచి ₹500కు
ఆఫ్‌లైన్‌లో, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చేసే డిజిటల్ పేమెంట్స్ (UPI Lite) మీద ఉన్న లావాదేవీ పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ₹200 నుంచి ₹500కు పెంచింది. 2-స్టెప్ అథెంటికేషన్ లేకుండా జరిగే ఈ తరహా చెల్లింపుల వల్ల రిస్క్ కూడా ఉంది కాబట్టి, మొత్తం పరిమితిని పెంచకుండా ₹2000 వద్దే ఉంచింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial