Home Loan Repayment: దాదాపు ఏడాదిన్న కాలంగా హోమ్ లోన్స్ మీద ఎక్కువ వడ్డీని, ఎక్కువ EMI మొత్తాలను చెల్లించాల్సి వస్తోంది. తీసుకున్న అప్పును టెన్యూర్ కంటే ముందే ముగించాలనుకుంటే, EMI కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించే ఫెసిలిటీ కూడా బారోయర్‌కు అందుబాటులో ఉంది. అంతేకాదు, లోన్ టెన్యూర్ పెంచుకుని EMI మొత్తాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
ప్రి-పేమెంట్, తర్వాతి కాలంలో హోమ్ లోన్ EMIని తగ్గిస్తుంది. వీలైనంత త్వరగా లోన్‌ను క్లోజ్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు, ప్రి-పేమెంట్ వల్ల హోమ్ లోన్‌పై వడ్డీ మొత్తం తగ్గుతుంది.
మీరు కూడా వీలైనంత త్వరగా మీ హోమ్ లోన్‌ను క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఐదు విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవు
RBI రూల్స్ ప్రకారం, ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో గృహ రుణం తీసుకున్న వ్యక్తికి ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వర్తించవు. మీ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు మారుతూ ఉంటే, ప్రీమెచ్యూర్ లోన్ టెర్మినేషన్ కోసం మీపై ఎలాంటి రుసుమును బ్యాంక్ విధించదు. అయితే, మీ రుణం స్థిర వడ్డీ రేటు కింద ఉంటే, బ్యాంకులు 4-5 శాతం ఫోర్‌క్లోజర్ ఛార్జీని వసూలు చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!
బ్యాంకుకు ముందుగా చెప్పాలి
ఇది తప్పనిసరి కాదు. కానీ, మీ హోమ్ లోన్‌ను ముందుగానే క్లోజ్ చేయాలనుకుంటే, మీ నిర్ణయాన్ని ఒక వారం లేదా రెండు వారాల ముందుగానే బ్యాంక్‌కు తెలియజేస్తే మంచిది. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, ఫోన్ ద్వారా గానీ, ఉత్తరం లేదా ఈ-మెయిల్ ద్వారా కూడా బ్యాంక్‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. దీనివల్ల, చివరి క్షణంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు.
NOC తీసుకోవడం తప్పనిసరి
ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ హౌస్ లోన్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లిస్తుంటే, బ్యాంకు నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ మీకు రక్షణగా పని చేస్తుంది. మీరు రుణం చెల్లించలేదని, లేదా పూర్తిగా చెల్లించలేదని ఎప్పుడైనా బ్యాంక్ మెలిక పెడితే, మీరు ఈ డాక్యుమెంట్ చూపించొచ్చు. ఇదే కాకుండా, బ్యాంక్ నుంచి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను (EC) అడగవచ్చు. మీ ఆస్తికి సంబంధించిన అన్ని లావాదేవీలు దీనిలో ఉంటాయి. చట్టపరమైన ఎలాంటి వివాదాలు లేవని నిర్ధరించుకోవడానికి ఇది అవసరం.
మీ ఆస్తిపై ఇతరులకు హక్కులు
మీ ఆస్తిపై మరొకరికి కూడా హక్కులు ఉంటే, తక్షణం దానిని తొలగించుకోవాలి. చట్టపరమైన సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఇది అవసరం.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేయండి
మీ హోమ్ లోన్ మొత్తాన్ని ఫోర్‌క్లోజర్ ద్వారా చెల్లించాక, బ్యాంక్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తిరిగి ఇస్తుంది. వాటిని జాగ్రత్తగా చెక్ తనిఖీ చేయండి, భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ముందుగానే జాగ్రత్త పడండి.
మరో ఆసక్తికర కథనం: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం - మనకు బాగానే ఉంటుంది, మిగిలిన ప్రపంచమంతా ఏడుస్తుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial