Gold Price Today 23 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ధర మరింత తగ్గితే కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.200 మేర ధర తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600గా ఉంది. హైదరాబాద్లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,100గా ఉంది. కరీంనగర్, వరంగల్లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.51,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600గా ఉంది. వెండి నిన్న రూ.700 దిగిరాగా, నేడు వెండి 1 కేజీ ధర రూ.61,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 23 August 2022) 10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,100 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,600 అయింది. 1 కేజీ వెండి ధర రూ.55,200 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కి క్షీణించింది. 1 కేజీ వెండి ధర రూ.55,200గా ఉంది.
పెరిగిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అన్ని నగరాలలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
రూ. 50 పెరగడంతో ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,070 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,070 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,070గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.