Rs 2000 Notes: ఆర్థిక వ్యవస్థ నుంచి విత్‌డ్రా చేస్తున్న 2 వేల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ, చిన్న నోట్లుగా మార్చుకోవడానికి గానీ మరొక్క నెల రోజుల సమయం మాత్రమే ఉంది. రిజర్వ్ బ్యాంక్ (RBI), ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకే గడువు ఇచ్చింది.
పింక్ నోట్లు మార్చుకోవడానికి గడువు దగ్గర పడిన నేపథ్యంలో, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.2 వేల రూపాయల నోట్లను తమ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేస్తే, భారీగా 9.50% వడ్డీ రేటు ఇస్తామని చెబుతోంది. ఆ బ్యాంక్ పేరు... యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank). ప్రస్తుతం ఏ ఇతర బ్యాంక్ కూడా FD మీద ఇంత పెద్ద వడ్డీ రేటు ఇవ్వడం లేదు.
ఒకవేళ రూ.2000 నోట్లను FD చేయడం కంటే సేవింగ్స్ అకౌంట్‌లో వేయాలనుకుంటే, యూనిటీ SFB దానిని కూడా కవర్ చేస్తోంది, సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సంవత్సరానికి 7% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తోంది.
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆదాయం
ప్రస్తుతం, యూనిటీ SFB సాధారణ ప్రజలకు 8.75% FD రేట్లను 6 నెలల నుంచి 201 రోజులు & 501 రోజుల కాలవ్యవధికి అందిస్తోంది. 1001 రోజుల వ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 9% వరకు FD రేటు ఇస్తోంది.
అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 6 నెలల నుంచి 201 రోజులు & 501 రోజుల మెచ్యూరిటీలపై 9.25% వడ్డీ రేట్లను అందిస్తోంది. 1001 రోజుల FDపై 9.50% వడ్డీ ఆదాయాన్ని అందుస్తోంది.
డిపాజిట్లకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ
DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) ద్వారా రూ.5 లక్షల డిపాజిట్ బీమాను కూడా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తోంది. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే, ఒక్కో డిపాజిట్‌పై 5 లక్షల రూపాయల వరకు (అసలు + వడ్డీ కలిపి) తిరిగి వస్తుంది. ఒకవేళ డిపాజిట్ విలువ రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, గరిష్టంగా రూ.5 లక్షలు మాత్రమే చేతికి వస్తుంది. ఒక్క యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FDలకే కాదు, ఏ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. అందువల్ల, ఏ బ్యాంక్‌లోనైనా, మీరు 5 లక్షల రూపాయలకు మించి FDలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే, దానిని రెండు భాగాలుగా (రూ.5 లక్షల లోపు విలువతో) మార్చి డిపాజిట్ చేయడం ఉత్తమం. అప్పుడు ఆ రెండు డిపాజిట్లకు పూర్తి బీమా రక్షణ ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్, ఈ ఏడాది మే నెలలో, ₹2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం, బ్యాంక్ ఖాతాల్లో ₹2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఇతర డినామినేషన్ నోట్ల రూపంలోకి మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.
2023 మార్చి చివరి నాటికి, భారతదేశంలో రూ. 3.7 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 2 వేల నోట్ల వాటా 10.8%. పింక్ నోట్ల విత్‌డ్రా తర్వాత అందులో సింహభాగం నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు, అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంక్ సేఫ్స్‌లోకి చేరాయి.
బ్యాంక్ అకౌంట్‌లో ₹2000 నోట్లను జమ చేయడానికి ప్రత్యేక రూల్స్ ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్న నో యువర్ కస్టమర్ (KYC) రూల్స్‌కు అనుగుణంగా, సాధారణ పద్ధతిలోనే పెద్ద నోట్లను జమ చేయవచ్చు.
2016లో, చలామణిలో ఉన్న అన్ని ₹500, ₹1000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, మార్కెట్‌లో కరెన్సీ నోట్ల లోటును భర్తీ చేయడానికి అదే సంవత్సరం రూ.2000 నోట్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగైదు సంవత్సరాలు. ఆ గడువు ఇప్పుడు ముగింపులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణ బంద్ చేశాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ రాఖీ పండుగ రోజున మీ సోదరికి ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి, ఈ 5 ఆప్షన్స్ బాగుంటాయి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial