Latest Interest Rates On Senior Citizen FDs: సాధారణంగా, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న జనాభా కంటే సీనియర్‌ సిటిజన్లు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఎక్కువ సంపాదిస్తారు. సాధారణంగా, 0.50 శాతం ఎక్కువ వడ్డీ రేటును అందుకుంటారు. దీనికి అదనంగా, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB కింద... బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఉన్న డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీపై 50,000 వరకు పన్ను మినహాయింపు పొందుతారు. ఇంకా, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకు వడ్డీపై TDS కట్‌ కాదు.


స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల్లో సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ రేట్లు ‍‌(FD Rates For Senior Citizen In Small Finance Banks‌): 


యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 9.50% ------  1001 రోజుల కాల వ్యవధి
నార్త్‌ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 9.50% ------  546 రోజుల నుంచి 1111 రోజులకు
సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 9.10% ------  2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు 
ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 9.10% ------  2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు; 1500 రోజులు  
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 9.00% ------  444 రోజుల కాల వ్యవధి
ESAF స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 8.75% ------  2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు
జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 8.75% ------  365 రోజుల నుంచి 1095 రోజులు 
AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 8.50% ------  18 నెలల కాల వ్యవధి 
ఉజ్జీవన్‌  స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ------ 8.50% ------  12 నెలల కాల వ్యవధి 


ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ల్లో సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ రేట్లు (FD Rates For Senior Citizen In Private Sector Banks): 


SBM బ్యాంక్‌ ------ ఇండియా 8.80% ------  15 నెలల నుంచి 18 నెలల కాలం
RBL బ్యాంక్‌ ------ 8.50% ------  18 నెలల నుంచి 2 సంవత్సరాలు
DCB బ్యాంక్‌ ------ 8.55% ------  376 రోజుల నుంచి 540 రోజులు
YES బ్యాంక్‌ ------ 8.50% ------  18 నెలలు
IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ ------ 8.40% ------  500 రోజులు
బంధన్‌ బ్యాంక్‌ ------ 8.35% ------  1 సంవత్సరం
కరూర్‌ వైశ్య బ్యాంక్‌ ------ 8.00% ------  444 రోజులు
కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ ------ 7.90% ------  390 రోజుల నుంచి 23 నెలల కాలం
ఫెడరల్‌ బ్యాంక్‌ ------ 7.90% ------  400 రోజులు 
ICICI బ్యాంక్‌ ------ 7.75% ------  15 నెలల నుంచి 18 నెలలు
HDFC బ్యాంక్‌ ------ 7.75% ------  18 నెలల నుంచి 21 నెలలు
సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ------ 7.75% ------  400 రోజులు
CSB బ్యాంక్‌ ------ 7.75% ------  401 రోజులు
యాక్సిస్‌ బ్యాంక్‌ ------ 7.75% ------  5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు


ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ రేట్లు (FD Rates For Senior Citizen In Public Sector Banks): 


ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ------ 7.80% ------  444 రోజులు 
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ------ 7.80% ------  444 రోజులు 
పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్‌ ------ 7.80% ------  444 రోజులు 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ------ 7.80% ------  666 రోజులు 
యూనియన్‌ బ్యాంక్‌ ------ ఆఫ్‌ ఇండియా 7.75% ------  399 రోజులు
ఇండియన్‌ బ్యాంక్‌ ------  7.75% ------  400 రోజులు (ఇండ్‌ సూపర్‌ FD స్కీమ్‌)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ------ 7.75% ------  400 రోజులు 
సెంట్రల్‌ బ్యాంక్‌ ------ 7.75% ------  444 రోజులు 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ------  7.75% ------  2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు
స్టేట్‌ బ్యాంక్‌ ------ 7.60% ------  400 రోజులు - (అమృత్‌ కలశ్‌ FD స్కీమ్‌‌)
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ------ 7.75% ------  777 రోజులు 


మరో ఆసక్తికర కథనం: పన్ను కట్టాల్సిన అవసరం లేని 13 ఆదాయాలు - ఈ లిస్ట్‌లోకి మీరూ వస్తారేమో చెక్‌ చేయండి