By: ABP Desam | Updated at : 03 May 2023 12:09 PM (IST)
అధిక పింఛను దరఖాస్తు గడువు పెంపు
EPFO Higher Pension Scheme: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ పొందే ఆప్షన్ కోసం తుది గడువును మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, ఈ గడువు నేటితో (03 మే 2023) ముగుస్తుంది, కానీ ఇప్పుడు దానిని సుమారు రెండు నెలల పాటు పొడిగించారు. కేంద్ర కార్మిక శాఖ మంగళవారం రాత్రి ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
జూన్ 26, 2023 వరకు గడువు పెంపు
గత ఏడాది నవంబర్ 4వ తేదీన ఇచ్చిన ఆర్డర్‌లో, దీనికి సంబంధించి గడువును మార్చి 3వ తేదీగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆ తర్వాత, EPFO దానిని మే 3వ తేదీ వరకు, రెండు నెలలు పొడిగించింది. ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. తాజా మార్పు తర్వాత, అర్హులైన చందాదార్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26, 2023 వరకు ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
సుప్రీంకోర్టు మొదటిసారి 4 నెలల గడువును నిర్ణయించినప్పుడు, అర్హులైన ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని పునరుద్ధరించడానికి EPFOకి చాలా సమయం పట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు నవంబర్‌లో వచ్చినా, EPFO ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. అంటే.. సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఫిక్స్ చేసి అప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. ఈ కారణంగానే తొలిసారిగా మార్చిలో గడువును పొడిగించాలని EPFO నిర్ణయించింది. ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకోని ఉద్యోగులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారని, వాళ్ల కోసమే గడువును మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
EPS-95 ఇలా మొదలైంది
కొన్ని సంవత్సరాల క్రితం వరకు, చాలా తక్కువ మంది మాత్రమే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ప్రయోజనం పొందేవారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకునేవారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరించింది. దీంతో, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు కూడా సామాజిక భద్రత ప్రయోజనాలను పొందడం ప్రారంభించారు. ఈ మార్పు 1995 సంవత్సరంలో జరిగింది. ఈ కారణంగా ఈ పథకాన్ని EPS-95 లేదా ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 అని కూడా పిలుస్తారు. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం కింద EPS ప్రవేశపెట్టారు కాబట్టి, EPF కిందకు వచ్చిన ప్రతి ఉద్యోగికి దాని ప్రయోజనాలు అందడం ప్రారంభమయ్యాయి. అయితే, ప్రాథమిక వేతనం, DA నెలకు రూ.15 వేలు ఉన్న ఉద్యోగులు మాత్రమే EPS ప్రయోజనం పొందుతారని షరతు విధించింది.
ఇలా చేస్తే ఎక్కువ పెన్షన్ వస్తుంది
EPSలో, ఉద్యోగి తరపు నుంచి ఎలాంటి జీతపు సహకారం ఉండదు. కంపెనీ చేసిన మొత్తం 12 శాతం కంట్రిబ్యూషన్‌లో కేవలం 8.33 శాతం మాత్రమే ఈపీఎస్‌కి వెళ్తుంది. పెన్షనబుల్ జీతం పరిమితి 15 వేలు కాబట్టి, ఈ కారణంగా EPS సహకారం కూడా 1,250 రూపాయలకు పరిమితం అయింది. కంపెనీ కంట్రిబ్యూషన్‌లో ఇంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే, అది ఈపీఎఫ్‌కి వెళ్తుంది. ఇప్పుడు EPSకి పెరిగిన సహకారం కంపెనీ వాటా నుంచి వెళ్తుంది కాబ్టటి, అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ టేక్ హోమ్ జీతంపై ఎటువంటి ప్రభావం పడదు.
ఈ పథకం ప్రతికూలతలు
EPS-95ని ఎంచుకోవడం ద్వారా, ఒక ఉద్యోగి పదవీ విరమణ తర్వాత కొంచెం ఎక్కువ పెన్షన్ పొందుతారు. కానీ PF మొత్తం మొత్తం తగ్గుతుంది. రెండో ప్రతికూలత ఏమిటంటే, ఉద్యోగులు పీఎఫ్‌లో చక్రవడ్డీ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు పీఎఫ్‌లో కొంత భాగం ఈపీఎస్‌కి వెళుతుంది కాబట్టి, ఆ ప్రయోజనం కూడా తగ్గుతుంది. EPS-95ని ఎంచుకోవడంలో ఉన్న మరో ప్రధాన ప్రతికూలత ఏమిటంటే, మీరు ముందుగానే పదవీ విరమణ చేయలేరు. దీని ప్రయోజనం 58 సంవత్సరాల వయస్సు వరకు లేదా కనీసం 10 సంవత్సరాల వరకు పనిచేసే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. EPSలో తక్కువ వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా, ఉద్యోగి మరణిస్తే, EPF మొత్తం నామినీకి చెందుతుంది. మరోవైపు, EPS విషయంలో, నామినీకి సగం పెన్షన్ ప్రయోజనం మాత్రమే లభిస్తుంది.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం