DA Hike:
సీపీఎస్‌ఈ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీపీఎస్‌ఈ కంపెనీల్లో బోర్డు లెవల్ పోస్టులు, అంతకన్నా తక్కువ స్థాయి, యూనియన్ ఏతర సూపర్ వైజర్ల డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచుతున్నట్టు ప్రకటించింది. 1992 చెల్లింపుల పద్ధతిలో ఐడీఏ ప్యాటెర్న్ అనుసరిస్తున్న వారికే డీఏ పెంపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ (DPE) 2023, జులై 7న ఆఫీస్ మెమొరాండమ్ జారీ చేసింది.
పైన పేర్కొన్న ఉద్యోగులకు సవరించిన డియర్‌నెస్ అలవెన్స్ 2023, జులై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. నెలకు రూ.3500 మూల వేతనం పొందుతున్న ఉద్యోగుల డీఏ రేటు 701.9 శాతంగా ఉండనుంది. అయితే రూ.15,428 మించి పెరగదు. నెలకు రూ.3,501 నుంచి రూ.6,500 బేసిక్ పే గల ఉద్యోగులకు డీఏ రేటు 526.4 శాతం పెంచారు. కాగా రూ.24,567కు మించి ఇవ్వరు. ఇక నెలకు రూ.6500 - 9500 మూల వేతనం పొందుతున్న ఉద్యోగుల డీఏను 421.1 శాతానికి పెంచారు. కనీస వేతనాన్ని రూ.34,216 గా పేర్కొన్నారు.
కరవు భృతి (Dearness Allowance) పొందేటప్పుడు చిల్లర పైసలను లెక్కించే విధానాన్ని కేంద్రం వెల్లడించింది. 50 పైసల కన్నా ఎక్కువ ఉంటే రూపాయికి పెంచుతారు. ఒకవేళ తక్కువగా ఉంటే ఇవ్వరు. త్రైమాసిక సూచీ సగటు 1099ని దృష్టిలో పెట్టుకొని ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో మొదటి తేదీన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సవరించిన కరవుభత్యం రేటును వెంటనే అమలు చేయాలని అన్ని శాఖలను ఆదేశించింది.
Also Read: మధుమేహులకు బంపర్ ఆఫర్! డయాబెటిక్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసింది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial