Vietnam Airlines Vietjet Air Ticket Offer: జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించడం అనేది భారతదేశంలో కోట్ల మంది చిరకాల స్వప్నం. తాము ఎప్పటికైనా విమానం ఎక్కకపోతామా అని ఎదురు చూస్తుంటారు. ఆ కలను నిజం చేసుకునే టైమ్ వచ్చింది. ఇప్పుడు విమాన టిక్కెట్లు కేవలం 11 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి.
విమాన టిక్కెట్లపై ఈ బంపర్ ఆఫర్‌ను వియత్నాం విమానయాన సంస్థ "వియత్‌జెట్ ఎయిర్" ప్రకటించింది. విమాన టిక్కెట్లపై వియత్నాంలో ఆఫర్ ప్రకటిస్తే మనకేంటి లాభం అనుకోవద్దు. మీరు కూడా ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎంచక్కా వియత్నాంలో ఓ టూర్ వేసి రావచ్చు.
ఎయిర్ ప్యాసెజర్లను పెంచుకునే లక్ష్యంతో వియత్‌జెట్ ఎయిర్ నామమాత్రపు ధరతో విమాన టిక్కెట్ల అమ్మకాలను ఓపెన్ చేసింది. మీరు కూడా ఓ టిక్కెట్ బుక్ చేసుకుని, ఎంచక్కా భారతదేశం నుంచి వియత్నాం వెళ్లవచ్చు. ఈ విమాన టిక్కెట్ కేవలం 11 రూపాయలకు (పన్నులు & రుసుములు మినహాయించి) అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఎకో క్లాస్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
మన దేశంలో.. ముంబై, దిల్లీ, కొచ్చి, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి వియత్నాంలోని హో చి మిన్ సిటీ, హనోయ్, డా నాంగ్ వంటి నగరాలకు వియత్‌జెట్ విమానాలు తిరుగుతున్నాయి. మీకు ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్లైట్స్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు.
టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
వియత్నాం విమానయాన సంస్థ ప్రతిపాదించిన రూ. 11 విమాన టిక్కెట్ ఆఫర్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత సీట్లకు మాత్రమే వర్తిస్తుంది, కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఎయిర్ టిక్కెట్ బుక్ చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకోవడానికి, వియత్‌జెట్ ఎయిర్ అధికారిక వెబ్‌సైట్ www.vietjetair.com లేదా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు.
ఆఫర్‌కు సంబంధించిన ఇతర సమాచారం
ఈ ఆఫర్ ఈ ఏడాది మొత్తం, అంటే డిసెంబర్ 31, 2025 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని బ్లాక్‌అవుట్ డేట్స్ (ప్రభుత్వ సెలవులు & పీక్ సీజన్ వంటివి) వర్తిస్తాయి. మీరు ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకుని, ఏదైన కారణం వల్ల ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకుంటే, అది సాధ్యమే, దీని కోసం నిర్ణీత రుసుము చెల్లించాలి. మీరు టికెట్ రద్దు చేసుకుంటే, రిఫండ్ మీ ట్రావెల్ వాలెట్‌లో జమ అవుతుంది. దీనికి కూడా కొంత రుసుము వసూలు చేస్తారు.
ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకమైనది?
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, రుచికరమైన ఆహారానికి వియత్నాం ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన దేశాన్ని సందర్శించడానికి ఈ ఆఫర్ మీకు ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది. మీరు ఒంటరిగా లేదా కుటుంబంతో కలిసి వియత్నాం సందర్శించాలనుకుంటే, ఇది గొప్ప అవకాశం కావచ్చు. భారత్ - వియత్నాం మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని ప్రోత్సహించే దిశగా ఈ ఆఫర్ పెద్ద అడుగు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్