By: ABP Desam | Updated at : 02 Jun 2022 02:41 PM (IST)
Edited By: Ramakrishna Paladi
జన్ ధన్ యోజన (PMJDY)
Banks struggle to make Jan Dhan accounts cost effective and viable : ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY) మొదలై ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పటికీ తక్కువ ఖర్చుతో ఈ ఖాతాలను నిర్వహించేందుకు బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని తెలిసింది. వ్యాపార దృక్పథంతో చూస్తే వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా మారింది. ఒక్కో జన్ ధన్ ఖాతా నిర్వహణకు ఏడాదికి రూ.3,200 నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతోంది. వీటి మెయింటెనెన్స్‌కు ఎక్కువగా టెక్నాలజీనే ఉపయోగిస్తున్నా కొత్త ఖాతాలు తెరిచేందుకు సమయం, మానవ వనరులు అవసరమవుతోంది.
ప్రస్తుతం జన్‌ధన్ ఖాతాల సగటు డిపాజిట్ మొత్తం రూ.3000గా ఉంటోంది. క్రమంగా రూ.5000 లేదా రూ.6000కు పెరుగుతుందని అంచనా. అయితే ఇందుకెంతో సమయం పట్టనుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 454.7 మిలియన్ల జన్‌ధన్ ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి. ఇందులో రూ.167,000 కోట్లుకు మించి నగదు నిల్వ ఉంది. ఎక్కువగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనే ఉన్నాయి. కొవిడ్ సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ, ఆరోగ్య బీమా డబ్బులు వేసేందుకు ఇవెంతగానో ఉపయోగపడ్డాయి. రాను రాను సగటు నిల్వ రూ.3,723కు పడిపోతుండటం కలవరపెడుతోంది. 430 మిలియన్లలో ఇప్పుడు 368.6 మిలియన్ల ఖాతాలే యాక్టివ్‌గా ఉన్నాయి.
జన్ ధన్ ఖాతాల్లోని నగదుపై ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపుగా 4 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. మిగతా వాటిల్లో ఇది 2.75 నుంచి 3.50 శాతమే కావడం గమనార్హం. ఒక్కో జన్ ధన్ ఖాతా కేవైసీకి 40 నుంచి 50 శాతం వరకు ఖర్చవుతోందని తెలిసింది. చాలా మంది కస్టమర్లు ఈ ఖాతాల్లో లావాదేవీలే చేపట్టడం లేదు. పేదలకు జీతభత్యాలు నేరుగా నగదు రూపంలోనే ఇవ్వడం, వారు ఖాతాల్లో జమ చేసుకోవడం తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు ఇబ్బంది అవుతోంది. నకిలీ ఖాతాలు ఎక్కువ అవ్వడంతో వాటి కేవైసీ చేపట్టేందుకు భారీగా ఖర్చవుతోంది. మరి ఈ సమస్యల నుంచి బ్యాంకులు ఎలా గట్టెక్కుతాయో చూడాలి!!
Guinness book of World Records Recognises the Achievements Made Under PMJDYhttp://t.co/XqY8O3z5tf pic.twitter.com/e8kqzmaNpg
— PMJDY (@PMJDY) January 21, 2015
PMJDY@ Pravasi Bharatiya Divas 2015
— PMJDY (@PMJDY) January 21, 2015
7-9 January, 2015
Gandhinagar, Gujarat, India pic.twitter.com/JHuviAEbxM
SBI ATM Transaction Fees:ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?