By: ABP Desam | Updated at : 22 Feb 2023 03:28 PM (IST)
Edited By: Arunmali
యాక్సిస్ బ్యాంక్ EMI ఎంత పెరుగుతుందో తెలుసా?
Axis Bank Loan Rate: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు (RBI Repo Rate) పెరిగినప్పటి నుంచి, అన్ని బ్యాంకులూ రుణ వడ్డీ రేట్లు పెంచే ప్రక్రియ మొదలు పెట్టాయి. ఈ జాబితాలో మరో పెద్ద ప్రైవేట్ బ్యాంక్ పేరు కూడా చేరింది. అది.. యాక్సిస్ బ్యాంక్. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌ను (MCLR) పెంచుతూ ఈ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు ఆదివారం (ఫిబ్రవరి 19, 2023) నుంచి అమలులోకి కూడా వచ్చాయి. ఇప్పుడు, కస్టమర్లపై EMI భారం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్ MCLR ఎంత పెరిగింది?
యాక్సిస్ బ్యాంక్, తన MCLR ను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. ఈ పెంపు తర్వాత...
బ్యాంకు ఓవర్‌నైట్ MCLR (ఒక రోజు రుణం మీద వడ్డీ) 8.60 శాతం నుంచి ఇప్పుడు 8.70 శాతానికి పెరిగింది.
3 నెలల MCLR 8.70 నుంచి 8.80 శాతానికి పెరిగింది. 6 నెలల MLCR 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది.
1 సంవత్సరం రుణంపై MCLR 8.80 శాతం నుంచి 8.90 శాతానికి పెరిగింది.
2 సంవత్సరాల MLCR 8.90 శాతం నుంచి 9.00 శాతానికి పెరిగింది.
3 సంవత్సరాల MLCR 8.95 శాతం నుంచి 9.05 శాతానికి పెరిగింది.
వినియోగదారులపై ఎంత భారం పడుతుంది?
MLCR పెంపు తర్వాత.. హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన రుణాల మీద బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు పెరిగింది. ఇదే కోవలో, యాక్సిస్ బ్యాంక్ రుణగ్రహీతల మీద EMIల భారం పెరుగుతుంది. రుణగ్రహీతలు నెలనెలా కట్టాల్సిన EMI మొత్తం, ఇప్పుడు కడుతున్నదానికి అదనంగా 0.1% పెరుగుతుంది.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) అంటే, బ్యాంకు తన కస్టమర్లకు అందించే కనీస రుణ రేటు. రిజర్వ్ బ్యాంక్ 2016లో MCLRని ప్రవేశపెట్టింది. ఏదైనా బ్యాంకు MCLRని పెంచితే, ఆటోమేటిక్‌గా ఆయా రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే, జనం జేబుల్లోంచి డబ్బులు తీసుకునే పని, మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా MCLR పెంచింది
యాక్సిస్ బ్యాంక్ కంటే ముందు, కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా MCLR పెంచింది. ఈ బ్యాంక్, తన MCLR ను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 16, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెరుగుదల తర్వాత, బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.20 శాతానికి, 1 నెల MCLR 8.54 శాతానికి, 3 నెలల MCLR 8.60 శాతానికి, 6 నెలల MCLR 8.80 శాతానికి, 1 సంవత్సరం MCLR 9.00 శాతానికి, 2 సంవత్సరాల MCLR 9.05 శాతానికి, 3 సంవత్సరాల MCLR 9.20 శాతానికి పెరిగింది.
రుణ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంక్ (RBI) నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 8న, రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది, ఇప్పుడు అది 6.50 శాతానికి చేరింది. ఈ పెరుగుదల వల్ల చాలా బ్యాంకులు తమ రుణాలు & FD వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరు కూడా ఇందులో ఉంది. ఎస్‌బీఐ కొత్త రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా రుణ వడ్డీ రేట్లను పెంచాయి.
Bank Locker Rules: బ్యాంక్ లాకర్లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్