Payments Without Internet: పాల పాకెట్ మొదలుకుని, మొబైల్ రీచార్జ్, కారెంట్ బిల్లు, యుటిలిటీ బిల్లులు.. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రకాల చెల్లింపులూ ఆన్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. యూపీఐ ఆధ్వర్యంలోని అన్ని పేమెంట్ యాప్స్‌తో ప్రతి పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు ఇంటర్‌నెట్ అనేది తప్పని సరి అవుతుంది. కానీ.. ఇంటర్‌నెట్ లేకుండా కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చెయొచ్చు అన్న విషయం మీకు తెలుసా.? అవును.. మీరు చదివింది అక్షరాల నిజమే.! ఇంతకీ.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముందుగా మీ డైలర్ కీబోర్డ్‌పై స్టార్ 99 హ్యాష్ ( *99# ) అని టైప్ చేసి కాలింగ్ బటన్‌పై నొక్కగానే మీకు సెలెక్ట్ ఆప్షన్స్‌గా ‘సెండ్ మనీ’, ‘రిక్వెస్ట్ మనీ’, ‘చెక్ బ్యాలన్స్’, ‘మై ప్రొఫైల్’, ‘పెండింగ్ రిక్వెస్ట్’, ‘ట్రాన్సాక్షన్స్’, ‘యూపీఐ పిన్’ ఏడు ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్‌లో మొదటిదైన Send Moneyపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్లీ మీకు ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మొబైల్ నెంబర్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు ఎవరికి అయితే మనీని సెండ్ చేయాలనుకుంటున్నారో అతడి యూపీఐతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేరు డిస్‌ప్లే, వెరిఫై చేసుకుంటుంది. ఆ తర్వాత ఎంత డబ్బులు పంపించాలి అని అడిగినప్పుడు సంబంధిత అమౌంట్‌ను ఎంటర్ చేస్తే చివరగా రిమార్క్ అడుగుతుంది. అప్పుడు "నో ఇంటర్ నెట్" అని టైప్ చేయాలి.
ఇక ఫైనల్‌గా మన యూపీఐ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఇలా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత డీటెయిల్స్ మొత్తం కరెక్ట్‌గా ఉంటే మనం పంపించిన డబ్బులు వారి ఖాతాలోకి వెళ్తాయి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ ప్రాసెస్ జీయో నెట్‌వర్క్ యూజర్లకు వర్తించదు.
సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా ? అయితే ఇది చూడండి!
ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్లు.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్దా ఉంటున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు కనీస అవసరాలుగా మారిపోయాయి. కానీ ఈ ఫోన్లు, ఇంటర్నెట్ వల్లే చాలా మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో ఇరుక్కుపోయి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ కోల్పోతున్నారు. అయితే అలాంటి సమస్యలు ఎదురైన వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని.. పోలీసులు చెబుతున్నారు. కోల్పోయిన సొమ్మును తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930ను ఆశ్రయించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.
పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు..
- సోషల్ మీడియాలో యాడ్స్ చూసి ఆఫర్ లో వస్తున్నాయని, ఆ యాడ్స్ లో ఉండే నంబర్స్ కి కాల్ చేసి సైబర్ మోసాలకు గురి కావొద్దు.
- నకిలీ హెల్ప్ లైన్ నంబర్ లను ఉంచుతారు. మీరు ఆ నంబర్ కు కాల్ చేస్తే సైబర్ మోసగాళ్లు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని సేకరించి, మిమ్మల్ని సులువుగా మోసం చేస్తారు.
- ఉచితంగా వచ్చే అన్నీ మంచివి కావు. ఆన్ లైన్ చెల్లింపులు చేయడానికి అసురక్షిత /పబ్లిక్ వైఫై నెట్ వర్క్స్ ను ఉపయోగించవద్దు.