DigiLocker, Aadhar News: డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ (Digital Empowerment) కోసం కేంద్రం నిరంతరం పనిచేస్తూనే ఉంది! గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే పనులు పూర్తయ్యేలా టెక్నాలజీని రూపొందిస్తోంది! డిజీలాకర్‌లో (DigiLocker) భద్రపరిచిన ఆధార్‌ కార్డులో (Aadhar card) అడ్రస్‌ను ఆటో అప్‌డేట్‌ చేసుకొనేలా యూజర్లను అనుమతించనుందని తెలిసింది. యునిక్‌ ఐటెంఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) ఇప్పటికే ఈ ప్రాసెస్‌ను చేపట్టిందని సమాచారం. ఇదే జరిగితే సులభంగానే పాన్‌ కార్డులోనూ మార్పులు చేసుకోవచ్చు.


ఇంతకు ముందే డిజి లాకర్‌ (DigiLocker)లోని డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రెస్‌ను ఆటో అప్‌డేట్‌ చేసుకొనే సౌకర్యం వచ్చిన సంగతి తెలిసిందే. యుఐడీఏఐ, మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌ఫోర్టు చెప్పినట్టుగా తమ అడ్రస్‌ మార్పుకు అంగీకరిస్తే డిజిలాకర్‌లోని డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతుంది. ఇప్పుడు ఆధార్‌ కార్డులో ఆటో అప్‌డేట్‌ తర్వాత పాన్‌ కార్డులోనూ చేసుకొనేలా ప్లాన్‌ చేస్తున్నారు. కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఆదాయపన్ను శాఖతో కలిసి యుఐడీఏఐ కలిసి పనిచేస్తోంది.


ఏదైనా డాక్యుమెంట్లో అడ్రస్‌ మార్పు కోసం యూజర్లు బ్యాంకులు, టాక్స్‌ పోర్టల్‌, ఇతర ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సెంట్రలైజ్‌ పోర్టల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు నింపినా డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్చాలంటే ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లాలి. ఇప్పుడు వచ్చిన ప్రక్రియతో ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. 'ఆధార్‌ కార్డులో సునాయాసంగా మార్పులు చేసేందుకు కొన్ని నెలలుగా శ్రమిస్తున్నాం. వివిధ ప్రభుత్వ శాఖలు, పబ్లిక్‌ యుటిలిటీ ఇంటర్ఫేస్‌లను ఆధార్‌ ఎలా సులభతరం చేస్తుందోనని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైతే ఆధార్‌ను కొన్ని అవసరాలకే ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి తమ ఇష్టం మేరకు ఇవ్వొచ్చు. ఈ మధ్యకాలంలో యూజర్లకు వేగంగా సేవలు అందించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో  యుఐడీఏఐ ఒప్పందం కుదుర్చుకుంది' అని ఒక అధికారి అన్నారు.


వాహన రిజిస్ట్రేషన్ల పత్రాలు, పాన్‌, ఇన్సూరెన్స్‌ పాలసీలు, యూనివర్సిటీ, పాఠశాల బోర్డుల సర్టిఫికెట్లు, ఆరోగ్య సమాచారం సహా అనేక డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు ప్రభుత్వం డిజీ లాకర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే చాలామంది ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అథెంటిక్‌ డిజిటల్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేశారు.


Also Read: డిజీలాకర్‌లో మీ డాక్యుమెంట్లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే!!


Also Read: ఈ డేంజర్‌ వైరస్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్లో చొరబడిందంటే! డబ్బంతా మాయం!


Also Read: పెళ్లి ఖర్చులకు పీఎఫ్‌ డబ్బు కావాలా? సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!