PF Withdrawal Limit for Marriage: ఉద్యోగానికి వీడ్కోలు పలికిన వారికి ఆశాదీపంగా నిలుస్తుంది ఈపీఎఫ్‌ (EPF)! ప్రతి నెలా మనం జమ చేసే కొద్దిమొత్తమే ఏళ్లు గడిచే కొద్దీ పెద్ద నిధిగా ఏర్పాటవుతుంది. అయితే మొత్తం కంట్రిబ్యూషన్‌ను రిటైర్మెంట్‌ తర్వాతే కాకుండా మన అవసరాలకు విత్‌డ్రా (EPF Withdrawal) చేసుకొనే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కొద్దిరోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతోంది. వివాహ ఖర్చుల కోసం పీఎఫ్‌ డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలంటే?


EPF విత్‌డ్రా వేటికి వర్తిస్తుంది?


పీఎఫ్‌ డబ్బును (PF Contribution) కొన్ని ప్రధాన అవసరాలకు మాత్రమే విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం (Home buying), ఆస్పత్రి ఖర్చులు, హోమ్‌ లోన్‌ కట్టడం (Home loan payment), ఇంటి మరమ్మతులు, పెళ్లి కోసం మాత్రమే పీఎఫ్‌ డబ్బును తీసుకోవచ్చు. అయితే మొత్తం పీఎఫ్‌ డబ్బును ఇవ్వరు. మన అవసరాన్ని బట్టి నిబంధనలను అనుసరించి ఇస్తారు.


PF డబ్బు ఎవరి పెళ్లికి తీసుకోవచ్చు?


పెళ్లి కోసం పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఆ ఉద్యోగికి తప్పనిసరిగా 7 సంవత్సరాల సర్వీస్‌ ఉండాలి. ఎంప్లాయి కాంట్రిబ్యూషన్‌లో 50 శాతం డబ్బును వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్‌ చందాదారుడు, అతడి తోబుట్టువులు, పిల్లల వివాహాల కోసం డబ్బును తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీ పీఎఫ్‌ ఖాతా యూఏఎన్‌ యాక్టివేట్‌ అయి ఉండాలి. అలాగే ఆధార్‌, పాన్‌తో లింకై ఉండాలి.


EPF విత్‌డ్రావల్‌ ప్రాసెస్‌



  • మొదట యూఏఎన్‌ (UAN), పాస్‌వర్డ్‌తో (Password) యూఏఎన్‌ మెంబర్‌ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి.

  • మెనూబార్‌లో 'ఆన్‌లైన్‌ సర్వీసెస్‌' ట్యాబ్‌పై క్లిక్‌ చేసి 'Claim (Form-31, 19,10C & 10D)'ను సెలెక్టు చేసుకోవాలి.

  • అప్పుడు చందాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంకు ఖాతా (Bank Account) ఆఖరి నాలుగు అంకెలను ఎంటర్‌ చేసి 'వెరిఫై' మీద క్లిక్‌ చేయండి.

  • అండర్‌టేకింగ్‌ సర్టిఫికెట్‌, తర్వాతి ప్రాసెస్‌ కోసం 'Yes' క్లిక్‌ చేయండి.

  • ఆ తర్వాత 'Proceed for Online claim'మీద క్లిక్‌ చేయండి.

  • 'పీఎఫ్‌ అడ్వాన్స్‌ (ఫామ్‌ 31'ను సెలెక్ట్‌ చేయండి.

  • ఇప్పుడు ఒక కొత్త ఫామ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీరు ఎందుకు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో క్లిక్‌ చేయండి.

  • కావాల్సిన డబ్బు, ఎంప్లాయి అడ్రెస్‌ను క్లిక్‌ చేయండి. ఎలిజిబిలిటీ లేకుంటే ఎరుపు రంగులో నోట్‌ కనిపిస్తుంది.

  • అన్నీ సవ్యంగా ఉంటే మీ అప్లికేషన్‌ను సబ్‌మిట్‌ చేయండి.

  • అవసరమైతే మీ పెళ్లి కార్డు లేదా సంబంధిత డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

  • ఆ తర్వాత మీ విత్‌డ్రావల్‌ రిక్వెస్ట్‌ను (EPF Withdrawal request) మీ యజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.

  • అప్రూవ్‌ తర్వాత ఈపీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు మీ బ్యాంకులో జమ అవుతుంది.

  • క్లెయిమ్‌ ప్రాసెస్‌ అవ్వగానే మీ మొబైల్‌కు సందేశం వస్తుంది. సాధారణంగా 12-15 రోజుల్లో డబ్బు జమ అవుతుంది.