Top Credit Cards with Cashback: ఇది ఆన్‌లైన్ యుగం. ఈ బిజీ లైఫ్‌లో సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ప్రజలు బయటకు వెళ్లి షాపింగ్ చేయకుండా, ఇంట్లో కూర్చునే వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. దీని కోసం వివిధ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. కోరుకున్న వస్తువును కొంటున్నప్పుడు క్యాష్‌బ్యాక్‌తో పాటు రివార్డ్ పాయింట్‌లను అందించే చాలా రకాల క్రెడిట్ కార్డ్‌లు ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో వాటిని ఉపయోగించి బెనిఫిట్స్ పొందొచ్చు.
మంచి క్యాష్‌బ్యాక్ అందించే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఇవి:
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ (Amazon Pay ICICI Bank Credit Card)
ఈ క్రెడిట్ కార్డ్‌తో, అమెజాన్‌లో షాపింగ్ చేసే ప్రైమ్ మెంబర్‌లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుండగా, నాన్ ప్రైమ్ మెంబర్‌లకు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డ్‌తో మీరు అమెజాన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే మంచి బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాదు, ఈ కార్డ్‌పై జాయినింగ్ ఫీజు లేదా యాన్యువల్ ఛార్జీ లేదు.
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ (Axis Bank ACE Credit Card)
ఈ కార్డ్‌ను ఉపయోగించి గూగుల్ పే (Google Pay) ద్వారా బిల్లు చెల్లింపులు లేదా రీఛార్జ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్; స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఓలా (Ola) వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం ఉపయోగిస్తే 4 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇవి కాకుండా, ఇతర చెల్లింపులపై 1.50 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.
ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ (SBI Cashback Credit Card)
ఈ కార్డ్ అన్ని ఆన్‌లైన్ ఖర్చులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఈ కార్డ్ యాన్యువల్ ఫీజ్ 999 రూపాయలు. అయితే, మీరు ఒక సంవత్సరంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజ్ ఉండదు. కార్డుపై వచ్చిన క్యాష్‌బ్యాక్ రెండు రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డ్ (HDFC Millennia Credit Card)
మీరు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మింత్రా (Myntra) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం ఈ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా, అన్ని ఇతర కేటగిరీల్లో చేసే వ్యయాలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Flipkart Axis Bank Credit Card)
ఈ కార్డ్‌ను ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్‌లోచేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. స్విగ్గీ, PVR, కల్ట్‌ఫిట్ (Cultfit), ఉబెర్ (Uber) వంటి ఇతర సైట్‌ల సర్వీస్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీనిని ఉపయోగించి Flipkartలో గాడ్జెట్‌లను కొనుగోలు చేయడం తెలివైన పని. దీని యాన్యువల్ ఫీజ్ 500 రూపాయలు. ఒక సంవత్సరంలో మీరు రూ. 3.50 లక్షల విలువైన కొనుగోళ్లు జరిపితే ఈ ఫీజ్ మాఫీ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: భలే ఛాన్స్, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ