Financial Fraud : డిజిటల్ లావాదేవీల కారణంగా ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయని గత మూడేళ్లలో దాదాపు 42 శాతం మంది భారతీయులు బాధితులుగా మారినట్లుగా కొత్త నివేదిక  వెల్లడించింది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ అందించిన డేటా ప్రకారం, గత మూడేళ్లలో, బ్యాంకింగ్ మోసాల కారణంగా డబ్బును కోల్పోయిన వారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే తమ నిధులను తిరిగి పొందగలిగారు . 74 శాతం మంది అసలు తమ ఫిర్యాదులపై ఎలాంటి సమాచారం కూడా పొందలేకపోయారు.  


డెబిట్ , క్రెడిట్ కార్డ్ పిన్ వివరాలను  బహిర్గత పర్చడం వల్ల సమస్య


29 శాతం మంది పౌరులు తమ డెబిట్ కార్డ్ పిన్ వివరాలను సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పంచుకున్నారని సర్వేలోతేలింది. అలాగే 4 శాతం మంది తమ ఇళ్లు, ఆఫీసుల్లో పని చేసే వారికి కూడాచెప్పారు.  33 శాతం మంది పౌరులు తమ బ్యాంక్ ఖాతా, డెబిట్ , డిట్ కార్డ్  పాస్‌వర్డ్‌లు, ఆధార్ , పాన్ నంబర్‌లను ఇ మెయిల్స్‌లో సేవ్ చేసుకున్నారు. 11 శాతం మంది పౌరులు ఈ వివరాలను తమ మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నారని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయింది.  


పలు రకాల మోసాలతో నష్టపోతున్న భారతీయులు


బ్యాంక్ ఖాతా మోసం, ఫ్లై-బై-నైట్ ఈ కామర్స్ ఆపరేటర్ల మోసం, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ మోసాలు సమస్యకు ప్రధాన కారణాలని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయింది.  ఫోన్ కాంటాక్ట్‌,  ఈ మెయిల్స్‌లో న్నితమైన ఆర్థిక వివరాలను సేవ్ చేసుకోవడం వల్ల   సైబర్ దాడులు గురవడానికి అవకాశం ఏర్పడింది.  బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ,  ATM, బ్యాంక్ ఖాతా, ఈ మెయిల్ మొదలైన వాటి వివరాలను స్మార్ట్‌ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో  సేవ్ చేయడం  సురక్షితం కాదని లోకల్ సర్కిల్స్ స్పష్టం చేసింది. 


పిన్ నెంబర్లు కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుంటే మోసాలకు ఎక్కువ అవకాశం 


ఈ రోజుల్లో ఆన్‌లైన్ యాప్‌లు ఒకరి కాంటాక్ట్‌లను , మెసెజ్‌లను సందేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతున్నాయి. యాక్సెస్ ఇస్తే వారు మన కాంటాక్ట్‌లు..మెసెజ్‌లు చూడగలరు. అందుకే ఆన్ లైన్ మోసాల నుంచి బయటపడటానికి   సెల్ ఫోన్ , ల్యాప్ ట్యాప్ వంటి గాడ్జెట్స్‌లో ఆల్ఫా-న్యూమరిక్ పాస్‌వర్డ్ లాక్‌ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లు  కష్టతరమైన రీతిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.