ఐపీవోకు ముందు పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్యూకు ముందు ప్రతిపాదిత రూ.2000 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. విలువ పరంగా తేడా రావడమే ఇందుకు కారణమని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.
ఇనిషియల్ ఇన్వెస్టర్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం 20 బిలియన్ డాలర్లకు పైగా విలువపై పేటీఎం కన్నేసింది. అయితే ఇష్యూకు సంబంధించిన అడ్వైజర్లు మాత్రం తక్కువ ధరైతే మంచిదని సూచించారు. ప్రస్తుతం కంపెనీ విలువను 16 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మనీకంట్రోల్ నివేదిక మాత్రం మరోలా ఉంది.
ప్రీ ఐపీవో రౌండ్‌ను మాత్రమే ఆపేయాలని పేటీఎం భావిస్తున్నట్టు మనీ కంట్రోల్ తెలిపింది. నవంబర్‌లో దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్లో నమోదవ్వాలని నిర్ణయించుకుంది. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తోంది. విలువ పరమైన తేడాలేమీ లేవని, సెబీ అనుమతి వచ్చిన వెంటనే మరో అదనపు ఫండింగ్ రౌండ్ నిర్వహిస్తుందని అంటున్నారు.
భారత స్టాక్ మార్కెట్లలో పేటీఎం ఐపీవో భారీ స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 2021 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో కంపెనీ రాబడి పది శాతం తగ్గింది. తుది నిర్ణయమైతే ఇంకా రాలేదు గానీ తక్కువ విలువతో ప్రీ ఐపీవో సేల్ నిర్వహించడాన్నీ కొట్టిపారేయడం లేదు. మరికొన్ని రోజుల్లో సెబీ ఐపీవోకు అనుమతి ఇస్తుందని సమాచారం.
మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచెస్, సిటీ గ్రూప్, ఐసీఐసీఐ షేర్ల విక్రయాలను చూసుకుంటున్నాయి. అయితే ఐపీవోకు ముందు రూ.20 బిలియన్ల ప్లేస్‌మెంట్‌ను పరిగణనలోకి తీసకుంటున్నామని పేటీఎం మార్కెట్ నియంత్రణ సంస్థకు చెప్పింది.
Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్ పెంపునకు ప్రభుత్వ ఆమోదం
Also Read: పేటీఎంకు ఆర్బీఐ షాక్! కోటి జరిమానా.. వెస్ట్రన్ యూనియన్‌కూ పెనాల్టీ
Also Read: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి