Organic farming financially empowering the farmers:   పతంజలి ఆయుర్వేద్ తన సేంద్రియ వ్యవసాయ ఉద్యమాన్ని అత్యంత చివరి స్థాయి రైతుల వద్దకు తీసుకెళ్తోంది. ఆర్గానిక్ సాగును   ప్రోత్సహించడం ద్వారా   రైతులకు సాధికారిత తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  భారతీయ వ్యవసాయాన్ని సమగ్రంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  బాబా రాందేవ్ , ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో దేశ వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేస్తూ ఆధునీకరిస్తున్నామని పతంజలి చెబుతోంది. 

Continues below advertisement


కార్యక్రమం ద్వారా రైతులకు సేంద్రియ పద్ధతుల శిక్షణ 


 పతంజలి  కిసాన్ సమృద్ధి కార్యక్రమం రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందులో పంట మార్పిడి, ఆకుపచ్చ ఎరువు తయారీ,  కంపోస్ట్ తయారీ వంటి సరళ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పతంజలి సేంద్రియ ఎరువులు, నేల-మెరుగుదల ఉత్పత్తులను అభివృద్ధి చేసింది, ఇవి పంటలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయని పతంజలి తెలిపింది. 


 డిజిటల్ యాప్ ,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన ధరలు 


పతంజలి తన డిజిటల్ చొరవలు రైతులకు మార్కెట్‌కు మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయని చెబుతోంది.  పతంజలి   కాంట్రాక్ట్ ఫార్మింగ్ ,  డిజిటల్ యాప్ ద్వారా రైతులకు ఖచ్చితమైన ధరలు ,  మార్కెట్ సమాచారం అందుతుంది. కంపెనీ మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుండి పంటలను కొనుగోలు చేస్తుంది, ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది. అదనంగా, పతంజలి గ్రామీణ మహిళలకు ఔషధ మొక్కల సాగు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సాధికారం చేస్తోంది అని కంపెనీ వివరించింది.


సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యం,  నీటి నాణ్యత మెరుగు 


 సేంద్రియ వ్యవసాయం పర్యావరణ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పద్ధతి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది, నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది , వవైవిధ్యాన్ని పెంచుతుంది. సాంప్రదాయ భారతీయ వ్యవసాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నామని కంపెనీ పేర్కొంది.


సుస్థిర వ్యవసాయం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం 


 రైతుల జీవనాన్ని మెరుగుపరుస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పతంజలి చెబుతోంది.  ఇది భారతదేశాన్ని సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ లీడర్‌గా మార్చవచ్చు. నిపుణులు పతంజలి మోడల్ వ్యవసాయ భవిష్యత్తును మార్చగలదని, ఆరోగ్యకరమైన పర్యావరణం , భవిష్యత్ తరాలకు సంపన్న వ్యవసాయానికి దారితీస్తుందని నమ్ముతున్నామని పతంజలితెలిపింది. 
 
పతంజలి   సేంద్రియ వ్యవసాయ ఉద్యమం సుస్థిరత, రైతుల సాధికారత,  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యాలతో ముందుకెళ్తోంది.   కిసాన్ సమృద్ధి కార్యక్రమం, డిజిటల్ యాప్,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు.