ఓలా త్వరలో ప్రారంభించనున్న ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ పూర్తిగా మహిళా సిబ్బందితోనే పనిచేయనుంది. ప్రపంచంలో పూర్తిగా మహిళలు పనిచేసే ఫ్యాక్టరీల్లో ఇదే అతి పెద్దది కానుంది. ఓలా వర్క్ ప్లేస్ విషయంలో ఇటీవలి కాలంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఇది మొదటి నిర్ణయం.
"ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆత్మనిర్భర్ మహిళలు అవసరం! ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తిగా మహిళలతో పనిచేస్తుందని తెలపడానికి ఎంతో గర్వపడుతున్నాను. పూర్తి స్థాయిలో 10 వేలకు పైగా మహిళలతో ఈ ఫ్యాక్టరీ పనిచేయనుంది. పూర్తిగా మహిళలు మాత్రమే పనిచేసే ఫ్యాక్టరీల్లో ప్రపంచంలో ఇదే మొదటిది" అని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మనదేశంలో లాంచ్!
మనదేశంలో పనిచేసే మహిళల శాతం క్రమంగా పెరుగుతుంది. అయితే తయారీ రంగంలో మాత్రం 12 శాతం మంది మహిళలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మనదేశ జనాభాలో 48 శాతం మంది మహిళలు ఉన్నారు. దేశంలో మహిళల జనాభా దాదాపు 66 కోట్ల వరకు ఉంది. ప్రపంచంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది కాబట్టి మహిళలకు కూడా ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉంది.
Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వచ్చేసింది!
"మహిళలకు ఆర్థిక పరమైన అవసరాలు కల్పించడం కేవలం వారి జీవితాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా, వారి కుటుంబాల జీవన స్థాయి కూడా మెరుగుపడుతుంది. మహిళలకు లేబర్ వర్క్ ఫోర్స్ లో అవకాశాలు ఇస్తే భారతదేశ జీడీపీ 27 శాతం వరకు పెరుగుతుంది" అని ఓలా ప్రకటనలో పేర్కొంది.
ఓలా తమిళనాడు ప్రారంభించనున్న ఫ్యూచర్ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతి పెద్ద టూ-వీలర్ ఫ్యాక్టరీగా ఉండనుంది. సంవత్సరానికి కోటి ఓలా ఎస్1, ఎస్1 ప్రో యూనిట్లను తయారు చేయడమే లక్ష్యంగా ఓలా ఈ ఫ్యాక్టరీని రూపొందిస్తుంది.
Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ రేపే.. ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!
Also Read: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చవకైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!